iDreamPost

నన్ను అపార్థం చేసుకోకండి.. IPL ఆడకపోవడానికి కారణమిదే! హ్యారీ బ్రూక్ ఎమోషనల్..

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాను ఈ సీజన్ లో ఆడకపోవడానికి కారణం చెబుతూ.. ఎమోషనల్ అయ్యాడు బ్రూక్.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాను ఈ సీజన్ లో ఆడకపోవడానికి కారణం చెబుతూ.. ఎమోషనల్ అయ్యాడు బ్రూక్.

నన్ను అపార్థం చేసుకోకండి.. IPL ఆడకపోవడానికి కారణమిదే! హ్యారీ బ్రూక్ ఎమోషనల్..

మార్చి 22 నుంచి క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. లీగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో.. అన్ని ఫ్రాంచైజీలు ముమ్మర ప్రాక్టీస్ కు తెరలేపాయి. అయితే కొన్ని టీమ్స్ ఊహించని షాకులు ఇస్తున్నారు ప్లేయర్లు. కొందరు గాయాలతో టోర్నీకి దూరమైతే.. ఇంకొందరు వ్యక్తిగత కారణాలతో ఈ ఐపీఎల్ సీజన్ కు దూరమవుతున్నారు. తాజాగా ఈ లీగ్ లో ఆడటం లేదని అందరికి షాకిచ్చాడు ఇంగ్లండ్ సంచలన బ్యాటర్ హ్యారీ బ్రూక్. దీంతో అతడిని కొంత మంది తప్పుపడుతున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ ఆడటం లేదని సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్, ఢిల్లీ ఫ్యాన్స్ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో తానెందుకు ఐపీఎల్ ఆడటం లేదో వివరిస్తూ భావోద్వేగానికి గురైయ్యాడు బ్రూక్. తన ఇంట జరిగిన విషాదాన్ని తెలియజేశాడు.

ట్విట్టర్ వేదికగా తాను ఐపీఎల్ 2024 సీజన్ కు ఎందుకు దూరమైయ్యాడో వివరించాడు. “ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ తరఫున ఆడటానికి నేను ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నాను. కానీ అనుకోని సంఘటన వల్ల ఈ టోర్నీలో ఆడలేకపోతున్నాను. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న మా అమ్మమ్మ చనిపోయారు. నేను చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరే ఎక్కువగా పెరిగాను. నాకు క్రికెట్ పై ఆసక్తి పెరగాడినికి ఆమె కారణం. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో నేను మనసు పెట్టి క్రికెట్ ఆడలేను. అందుకే టోర్నీని నుంచి తప్పుకుంటున్నాను” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు.

హ్యారీ బ్రూక్ తనను అపార్థం చేసుకుంటున్న వారికి.. తానెందు ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో తెలియజేశాడు. దీంతో పాటుగా భారత్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు కూడా అందుబాటులో లేడు బ్రూక్. తన అమ్మమ్మ ఎక్కువ కాలం జీవించదని తెలియడంతో.. ఎక్కువ సమయం ఆమెతో గడపాలని భావించి ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో.. ఢిల్లీ ఫ్యాన్స్ తో పాటుగా క్రికెట్ అభిమానులు బ్రూక్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇదికూడా చదవండి: IPLలో ఆ రూల్ తీసేస్తే.. ఈ ప్లేయర్లకు 100 కోట్లు ఖాయం: రాబిన్ ఊతప్ప

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి