iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన IPL సూపర్‌ స్టార్‌!

  • Published Jan 14, 2024 | 11:05 AM Updated Updated Jan 14, 2024 | 11:05 AM

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెద్దగా రాణించకపోయినా.. ఐపీఎల్‌ తొలి సీజన్‌లోనే సెంచరీ, ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న ఐపీఎల్‌ తొలి సూపర్‌ స్టార్‌ తాజాగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో? అతను సాధించిన ఘనతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెద్దగా రాణించకపోయినా.. ఐపీఎల్‌ తొలి సీజన్‌లోనే సెంచరీ, ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న ఐపీఎల్‌ తొలి సూపర్‌ స్టార్‌ తాజాగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో? అతను సాధించిన ఘనతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 14, 2024 | 11:05 AMUpdated Jan 14, 2024 | 11:05 AM
బ్రేకింగ్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన IPL సూపర్‌ స్టార్‌!

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం రిటైర్మెంట్ల కాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆటగాళ్లు కొన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. తాజా మరో ఆస్ట్రేలియన్‌ దిగ్గజ క్రికెటర్‌ షాన్‌ మార్ష్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరం అవుతున్నట్లు వెల్లడించాడు. క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు షాన్‌ మార్ష్‌. ఈ ఆస్ట్రేలియన్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ సృష్టించిన విధ్వంసాలు అన్ని ఇన్ని కావు. ఆసీస్‌ జట్టు టాపార్డర్‌లో చాలా కాలం పాట తిరుగులేని ఆటగాడిగా, విధ్వంసకర బ్యాటర్‌గా సేవలందించాడు. తన కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉన్నా.. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో మార్ష్‌ కూడా ఒకడు.

ఆసీస్‌ జట్టుతో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కూడా షాన్‌ మార్ష్‌ తన ముద్ర వేశాడు. ఐపీఎల్‌ ప్రారంభం ఏడాది 2008లో అప్పటి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన మార్ష్‌ తన అద్భుతమైన ఆటతో పంజాబ్‌ను ముందుండి నడిపించాడు. అప్పటి కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌కు తోడు.. పంజాబ్‌లో స్టార్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. అలా చాలా కాలం పాటు ఐపీఎల్‌లో సూపర్‌ స్టార్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ పెద్దగా ఆడనప్పటికీ.. 2008లో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్ తరపున అత్యధిక పరుగుల స్కోరర్. అలాగే బిగ్‌ బాష్‌-2లో టాప్‌ స్కోరర్‌. పెర్త్ స్కార్చర్స్‌ బీబీఎల్‌-3, బీబీఎల్‌-4 వరుసగా రెండు టైటిల్స్‌ గెలిచిందంటే అందుకు కారణం మార్ష్‌. రెండు ఫైనల్స్‌లోనూ 63, 73 పరుగులు చేసి స్కార్చర్స్‌కు వరుస టైటిల్స్‌ను అందించాడు.

మార్ష్‌.. 2008 జూన్‌ 20న వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జూన్‌ 24న విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో ఫిఫ్టీ ఓవర్స్‌ ఫార్మాట్‌లోకి కూడా అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి దూసుకొచ్చిన మార్ష్‌కు టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం 2011లో దక్కింది. సెప్టెంబర్‌ 8న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో మార్ష్‌ టెస్ట్‌ క్రికెట్‌లో వచ్చాడు. అయితే టెస్టులు, వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. తన కెరీర్‌లో మొత్తం 38 టెస్టులు ఆడిన మార్ష్‌.. 2265 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 73 వన్డేల్లో 2773 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. అలాగే 15 టీ20ల్లో 225 పరుగులు మాత్రమే చేశాడు.

ఐపీఎల్‌ల్లో దుమ్మురేపిన మార్ష్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ఇక 2018-19 తర్వాత బ్యాడ్‌ఫామ్‌తో మార్ష్‌ ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయాడు. ఓవెల్‌లో జూన్‌ 15, 2019లో శ్రీలంకతో జరిగిన వన్డే మార్ష్‌ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ఐపీఎల్‌ 2008-2017 సీజన్‌ వరకు మార్ష్‌ ఆడాడు. మొత్తంగా 71 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన మార్ష్‌ తొలి సీజన్‌లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. మొత్తం 71 మ్యాచ్‌ల్లో కలిపి 2477 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 20 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2008 సీజన్‌లో మార్ష్‌ ఏకంగా 616 పరుగులు చేశాడు. అందుకే అతన్ని ఐపీఎల్‌ ఫస్ట్‌ సూపర్‌ స్టార్‌ అంటుంటారు. మరి అలాంటి ఆటగాడు క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.