iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌ టోర్నీ విడిచి స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ క్రికెటర్‌! అది కూడా ట్రైన్‌లో..

  • Published Oct 26, 2023 | 12:59 PM Updated Updated Oct 26, 2023 | 12:59 PM

వరల్డ్‌ కప్‌ టోర్నీ మధ్యలో ఓ టీమ్‌ కెప్టెన్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. అది కూడా ట్రైన్‌లో. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. అదే నిజం. అయితే.. ఇంత సడెన్‌గా ఆ ప్లేయర్‌ స్వదేశానికి ఎందుకు వెళ్లాడో సరైన స్పష్టత లేకపోయినా.. అతను ట్రైన్‌లో స్వదేశానికి ఎందుకు వెళ్లాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వరల్డ్‌ కప్‌ టోర్నీ మధ్యలో ఓ టీమ్‌ కెప్టెన్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. అది కూడా ట్రైన్‌లో. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. అదే నిజం. అయితే.. ఇంత సడెన్‌గా ఆ ప్లేయర్‌ స్వదేశానికి ఎందుకు వెళ్లాడో సరైన స్పష్టత లేకపోయినా.. అతను ట్రైన్‌లో స్వదేశానికి ఎందుకు వెళ్లాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 26, 2023 | 12:59 PMUpdated Oct 26, 2023 | 12:59 PM
వరల్డ్‌ కప్‌ టోర్నీ విడిచి స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ క్రికెటర్‌! అది కూడా ట్రైన్‌లో..

ప్రస్తుతం వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో సూపర్‌గా జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ టీమ్‌ ఎవర్ని ఓడిస్తోంది అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. క్రికెట్‌ అభిమానులకు అద్భుతంగా క్రికెట్‌ మజాను పంచుతూ.. అన్ని టీమ్స్‌ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి టైమ్‌లో ఓ టీమ్‌ కెప్టెన్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ విడిచి, ఇండియా నుంచి స్వదేశానికి వెళ్లిపోయాడు. అది కూడా విమానంలో కాదు.. ట్రైన్‌లో తన మాతృదేశానికి వెళ్లిపోయాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్‌ అని ఆశ్చర్యపోతున్నారా? బంగ్లాదేశ్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్‌ ఒక విజయంతో నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

ఈ నెల 28న నెదర్లాండ్స్‌తో, 31న పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లకు ముందు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌.. స్వదేశానికి పయనం అవ్వడం అందర్ని షాక్‌కు గురిచేస్తోంది. బంగ్లాదేశ్‌కు సెమీస్‌ చేరే అవకాశాలు పెద్దగా లేకపోయినా.. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. షకీబ్‌ లాంటి స్టార్‌, అనుభవం ఉన్న ఆటగాడు ఉండాల్సిందే. కానీ, షకీబ్‌ ఇప్పుడు ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లడానికి కారణం ఏంటో ఇప్పటి వరకు తెలిసిరాలేదు. అయితే.. ఏదో అత్యవసర పనిపైనే అతను ఢాకా వెళ్లినట్లు సమచారాం.

షకీబ్‌తో పాటు అతని ట్రైనర్‌ నజ్ముల్ అబీదీన్ ఫహీమ్ సైతం ఢాకా వెళ్లాడు. కాగా, వీళ్లిద్దరూ ఫ్లైట్‌లో కాకుండా.. ట్రైన్‌లో బంగ్లాదేశ్‌ వెళ్లారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ టీమ్‌ కోల్‌కత్తాలో ఉంది. నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌లను బంగ్లా.. కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లోనే ఆడనుంది. కోల్‌కత్తా నుంచి ఢాకా దగ్గరే కావడంతో షకీబ్‌ ట్రైన్‌లో స్వదేశానికి వెళ్లాడు. అంతర్జాతీయ క్రికెటర్‌ అయిన షకీబ్‌ ఇలా ట్రైన్‌లో స్వదేశానికి వెళ్లడం విశేషం. అతన్ని చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఎగబడ్డారు. భారీ భద్రత మధ్య షకీబ్‌ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మరి షకీబ్‌ ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కు ట్రైన్‌లో ప్రయాణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత.. మియా డామినేషన్ మామూలుగా లేదుగా!