iDreamPost
android-app
ios-app

జవాన్ ట్రైలర్ విడుదల.. ఈసారి పఠాన్ కి మించి..!

జవాన్ ట్రైలర్ విడుదల.. ఈసారి పఠాన్ కి మించి..!

బాలీవుడ్ బాద్ షా సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నిండుతుంది. ఎప్పుడెప్పుడు షారుక్ ఖాన్ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో వచ్చిన షారుక్ బాలీవుడ్ బాద్ షా అంటే ఎవరూ అనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ కొంచం గ్యాప్ లోనే జవాన్ సినిమాతో బాక్సాఫీస్ వేట మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా నుంచి తాజాగా జవాన్ ప్రివ్యూని రిలీజ్ చేశారు. మరి.. ఆ ప్రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

షారుక్ ఖాన్ సినిమా అంటే అందరూ అన్నీ ఎమోషన్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఫన్, లవ్, కామెడీ ఉండాలని కోరుకుంటారు. కానీ, ఈ ప్రివ్యూలో మాత్రం మీకు అంతా యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. షారుక్ ఖాన్- అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. పైగా ఈ సినిమాలో దీపికా పదుకొణె, లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి.. ఇలా చాలా గొప్ప స్టార్ కాస్ట్ ఉంది.

ఈ ప్రివ్యూని నేను ఎవరిని అనే ప్రశ్నతో ప్రారంభించారు. ప్రతి షాట్ కూడా యాక్షన్ ప్యాక్డ్ గా కనిపించింది. నయనతార, దీపికా, విజయ్ సేతుపతి, ప్రియమణి అందరి క్యారెక్టర్స్ లో మంచి యాక్షన్ స్కోప్ కనిపిస్తోంది. ప్రతి ఒక్క యాక్టర్ ఈ యాక్షన్ లో భాగం అయినట్లే ఉంది. ఈ ప్రివ్యూలో మీ దృష్టి యాక్షన్ తర్వాత బీజీఎం మీదే పడుతుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మూవీలో బీజీఎం ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే దానికి ఈ శాంపిల్ సరిపోతుంది.

ఈ ప్రివ్యూ ఎండింగ్ లో నేను విలన్ అయితే.. ఏ హీరో నా ముందు నిలబడలేడు అనే డైలాగ్ సినిమా స్టోరీని చెప్పే విధంగా ఉంది. అంటే ఈ సినిమాలో హీరో షారుక్ ఖాన్ ఒకానొక సమయంలో సిస్టమ్ కి ఎదురు వెళ్తాడు అనిపిస్తోంది. పైగా మెట్రోలో అందరినీ హాస్టేజెస్ గా తీసుకున్నట్లు చూపించారు. మొత్తానికి ఈ సినిమా ఒక యాక్షన్ ప్యాక్డ్ ల్యాండ్ మైన అనడంలో సందేహం లేదని చెప్పచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై గౌరి ఖాన్, గౌరవ్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş