iDreamPost

ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ బేక్ అవుట్!

ఇటీవల వరుస విజయాలతో దూసుక పోతున్నాడు కింగ్ కాంగ్ షారూక్ ఖాన్. ఇక ప్రపంచం మొత్తం గర్వించే హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరూ నటిస్తున్న మూవీస్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు వేసుకుంటున్నారు.

ఇటీవల వరుస విజయాలతో దూసుక పోతున్నాడు కింగ్ కాంగ్ షారూక్ ఖాన్. ఇక ప్రపంచం మొత్తం గర్వించే హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరూ నటిస్తున్న మూవీస్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు వేసుకుంటున్నారు.

ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ బేక్ అవుట్!

ఇండియన్ బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫైర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన సలార్ టీజర్ రేపు విడుదల కాబోతుంది. ఇక సలార్ పార్ట్ – 1, డిసెంబర్ 22న తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సలార్ రిలీజ్ ఇప్పుడు బాలీవుడ్ కి ఊపరిరాడనివ్వడంలేదు. ఎందుకంటే సలార్ సినిమాతో పాటుగా రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ కాంబోలో తయారైన డంకీ సినిమా కూడా ఇదే తేదీకి లాక్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది కింగ్ కాంగ్ షారూక్ ఖాన్.. పటాన్, జవాన్ తో భారీ విజయాలు అందుకున్నారు. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్, షారూఖ్ నటిస్తున్న డంకీ మొత్తం టీంకి బేజారెక్కిపోయింది. దీనికి కారణం ప్రత్యేకంగా లేకపోలేదు. ఇంతకు ముందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ పార్ట్ వన్ అండ్ టు క్రియేట్ చేసిన సంచలనం ఇంతా అంతా కాదు. ప్రభాస్ గతంలో సినిమాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచినప్పటికీ, ప్రస్తుతం వస్తున్న సలార్ మాత్రం బాలీవుడ్ కి డేంజర్ సిగ్నల్స్ పంపిస్తోంది. ఈ సంవత్సరం జూలై నెలలో విడుదలైన టీజర్ అందరిలో వణుకు పుట్టించింది. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సలార్ గురించి బైటకు వస్తున్న వార్తా సమాచారం వింటుంటే ఇది ఈ సారి బాక్సాఫీసుని ఊచకోత కోయబోతోందన్న అంచనాలు ట్రేడ్ పండిట్స్ అందరిలో పుట్టుకొస్తున్నాయి.

ఇదిలా ఉంటే సలార్ రిలీజ్ అయితే డంకీ మూవీపై తీవ్ర ప్రభావం ఉండబోదుందని మీడియాలో బాహాటంగానే వ్యక్తం అవుతుంది. అక్కడి మీడియా సీనియర్స్, ట్రేడ్ పండిట్స్ ఇద్దరికిద్దరూ కూడా ట్విట్టర్, ఇతర ప్లాట్ ఫామ్స్ వేధికలో రాస్తున్న విశ్లేషణలు డంకీ టీంని హెచ్చరికలాటి కథనాలను వెలువరిస్తున్నాయి. వద్దు, సలార్ తో పోటీ పడొద్దు అన్న అర్ధం వచ్చేట్టుగా రాస్తున్న మీడియా కథనాలకు షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ ఇద్దరూ తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయారు. పైగా, ధియేటర్లు మొత్తంలో ఎక్కువ శాతం మెరిట్ ధియేటర్స్ చాలా వరకూ సలార్ సినిమాకే నైవేద్యం అన్నట్టుగా తయారైంది అక్కడి వాతావరణం.

బాలీవుడ్ ట్రేడ్ కూడా బిజినెస్ విషయంలో గానీ, ఇతరత్రా లావాదేవీల విషయంలో గానీ సలార్ సినిమాకే పెద్ద పీట వేస్తున్నారు. ఇటువంటి నేపథ్యానికి ప్రభాస్, ఫ్రశాంత్ నీల్ కాంబోకి ఉన్న క్రేజ్ కొంత కారణమైతే, తెలుగువారు నిర్మించిన లేదా దక్షిణాది మెరిట్ పట్ల బాలీవుడ్ ఇటీవలి రోజులలో చూపుతున్న గౌరవం మరికొంత కారణమని చెప్పాలి. అందుకు సలార్ సినిమాని చూసి భయపడి రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశం ఏదైనా ఉండొచ్చు అని అనుమానాలు వస్తున్నాయి. ఇంకా వర్క్ పూర్తి కాలేదు, కొంత వర్క్ బ్యాలెన్స్ ఉందని కారణాలు చెప్పి, డంకీ సినిమా రిలీజ్ తేదీని వాయిదా వేసే అవకాశం ఉండొచ్చు అని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి