SNP
Shah Rukh Khan, Pooja Dadlani: ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసేందుకు షారుఖ్‌తో కలిసి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరు? ఎందుకు షారుఖ్‌తో వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Shah Rukh Khan, Pooja Dadlani: ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసేందుకు షారుఖ్‌తో కలిసి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరు? ఎందుకు షారుఖ్‌తో వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్లో రెండో రోజే ఒక సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్లింది. ఈ సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చివరికి కోల్కత్తా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు కేకేఆర్ కో ఓవర్ షారుఖ్ ఖాన్ వచ్చాడు. అతని రాకతో మ్యాచ్‌కి మంచి గ్లామర్ టచ్ వచ్చింది. సాధారణంగా ఐపీఎల్ ప్రతీ సీజన్లో కేకేఆర్ ఆడే మ్యాచ్‌లకు షారుఖ్ ఖాన్.. తన ఫ్యామిలీతో కలిసి వచ్చేవాడు. షారుఖ్ కూతురు, కొడుకు, చిన్న కుమారుడు కూడా చాలా సార్లు మ్యాచ్‌లకు వచ్చారు. కొన్ని సార్లు స్టార్ హీరోయిన్లు, అప్ కమింగ్ హీరోయిన్లు కూడా షారుఖ్‌తో కలిసి కేకేఆర్ మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి వచ్చే వాళ్లు.
శనివారం కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా షారుఖ్ ఖాన్‌తో ఓ బ్యూటీ వచ్చింది. అయితే ఆమె ఎవరో చాలా మందికి తెలియదు. దీంతో.. ఆమె ఎవరు? షారుఖ్ ఖాన్‌తో ఆమెకున్న రిలేషన్ ఏంటి? ఫ్యామిలీ మెంబరా? లేక అప్‌కమింగ్ హీరోయినా? అంటే కొంతమంది నెటిజన్లు ఆరా తీశారు. అయితే.. ఆమె హీరోయిన్ కాదు, షారుఖ్ కుటుంబ సభ్యురాలు కూడా కాదు. ఆమె షారుఖ్ మేనేజర్, పేరు పూజా దద్లానీ. చాలా ఏళ్లుగా ఆమె షారుఖ్ ఖాన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. షారుఖ్‌కు సినిమాలతో పాటు పలు వ్యాపారాలు ఉన్న విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటటైన్మెంట్, కేకేఆర్ ఇలా మరికొన్ని బిజినెస్‌లు ఉన్నాయి. వీటిన్నటిని పుజా కూడా మ్యానేజ్ చేస్తూ ఉంటారు. ఆమెకే నెలకు దాదాపు కోటి రుపాయల జీతం ఇస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఆమె కూడా షారుఖ్‌తో కలిసి శనివారం మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అయితే.. ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉండటం విశేషం. వాళ్లు ఎవరనే విషయంపై క్లారిటీ లేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సాల్ట్ 54, రమన్‌దీప్‌సింగ్ 35, రింకూ సింగ్ 23, రస్సెల్ 64 పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లతో సత్తాచాటాడు. ఇక 209 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి.. 4 రన్స్‌తో ఓటమి పాలైంది. హెన్రిచ్ క్లాసెన్ 29 బంతుల్లో 63 పరుగులతో విధ్వంసం సృష్టించినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. మొత్తంగా తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్ చూసేందుకు షారుఖ్‌తో కలిసి వచ్చిన పూజా దద్లానీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The King has arrived 👑 pic.twitter.com/3e8Xbcvszm
— KolkataKnightRiders (@KKRiders) March 23, 2024