iDreamPost
android-app
ios-app

నేపాల్ క్రికెటర్ కు చేయూతనిచ్చిన షాదీ డాట్ కామ్ CEO!

  • Author Soma Sekhar Published - 06:17 PM, Thu - 14 September 23
  • Author Soma Sekhar Published - 06:17 PM, Thu - 14 September 23
నేపాల్ క్రికెటర్ కు చేయూతనిచ్చిన షాదీ డాట్ కామ్ CEO!

ఎంతో మంది యువకులు స్టార్ క్రికెటర్లుగా అవ్వాలని కలలు కంటూ ఉంటారు. కానీ అది ఖర్చుతో కూడుకున్న కెరీర్ అవ్వడం వల్ల.. చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అదీకాక ఇంటర్నేషనల్ క్రికెటర్ అయ్యాక కూడా సరైన వసతులు, క్రికెట్ కిట్స్ లేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు పసికూన జట్లకు చెందిన ప్లేయర్లు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఫేస్ చేస్తున్న నేపాలీ క్రికెటర్ కు చేయూతనందించాడు షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిత్తల్. నేపాల్ ఆటగాడు అయిన లలిత్ రాజ్ బన్సీ కి అండగా నిలిచాడు అనుపమ్ మిత్తల్. అతడు చేసిన ఒక్క ట్వీట్ కు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నాడు షాదీ డాట్ కామ్ సీఈవో.

ఆసియా కప్ లో భాగంగా ఇండియా-నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ అనంతరం నేపాల్ ఆటగాళ్లు టీమిండియా స్టార్ ప్లేయర్స్ తో ఫొటోలు దిగారు. అనంతరం ఆ ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే లలిత్ రాజ్ బన్సీ కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో దిగిన పిక్ ను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఫొటోను షేర్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చాడు. “నేను చాలా మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేశాను. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడటానికి నా దగ్గర సరైన క్రికెట్ కిట్ లేదు. ప్రాక్టీస్ టైమ్ లో, మ్యాచ్ ల్లో నా సహచర టీమ్మెట్స్ పై ఆధారపడాల్సి వస్తోంది. ఎక్కువగా కుశాల్ బూర్టెల్ బ్యాట్ ను వినియోగిస్తాను” అంటూ తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరించాడు.

ఇక ఈ ట్వీట్ కాస్త వైరల్ కావడంతో.. లలిత్ రాజ్ బన్సీ సమస్యపై స్పందించాడు షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిత్తల్. ‘రాజ్ బన్సీ కోసం ఖరీదైన క్రికెట్ కిట్ ను అందిస్తాను. అతడిని కలుసుకునే అవకాశం కల్పించండి’ అంటూ సోషల్ మీడియాలో కోరాడు. ఇది చూసిన రాజ్ బన్సీ ఎంతో ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అనుపమ్ మిత్తల్ కు ధన్యవాదాలు తెలిపాడు. మరి నేపాల్ క్రికెటర్ కు అండగా నిలిచిన షాదీడాట్ కామ్ సీఈవోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.