iDreamPost

ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్‌’ సిస్టర్స్‌! ఓ నాన్న సాధించిన విజయం ఇది!

Seven Police Sisters: దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించింది. కానీ ఒక్క ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా పాత పోకడలే పోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే ఇంకా చిన్న చూపు చూస్తున్నారు.

Seven Police Sisters: దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించింది. కానీ ఒక్క ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా పాత పోకడలే పోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే ఇంకా చిన్న చూపు చూస్తున్నారు.

ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్‌’ సిస్టర్స్‌! ఓ నాన్న సాధించిన విజయం ఇది!

భారత దేశంలో ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో మగవాళ్లతో ధీటుగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడ పిల్ల పుడితే చిన్న చూపు చూడటమే కాదు.. తల్లిదండ్రులను హేళనగా చూస్తున్నారు. ఆడ పిల్లలు కుటుంబానికి అన్ని విషయాల్లో భారంగా భావించే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఆడ పిల్లలను సమాజం, దేశం గర్వించే విధంగా తీర్చి దిద్దుతున్నారు. ఓ తండ్రి తన ఏడుగురు ఆడపిల్లలను దేశం గర్వించే స్థాయిలో తీర్చి దిద్దాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిహార్ లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కా చెల్లెళ్లు పోలీస్, క్రైమ్ బ్రాంచ్, ఎక్సైజ్, కేంద్ర సాయుధ బలగం, రైల్వే పోలీసులుగా పనిచేస్తున్నారు. ఈ స్థాయికి రావడానికి తమ తండ్రి ప్రోత్సాహమే అంటున్నారు అక్కాచెల్లెళ్లు. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం ఛప్రా జిల్లాకు చెందిన కమల్ సింగ్ కు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టడంతో స్థానికులు, బంధువులు కమల్ సింగ్ అతని భార్యని చిన్న చూపు చూడటం, అవహేళనగా మాట్లాడటం చేసేవారు. దీంతో కమల్ సింగ్ దంపతులు మానసికంగా కృంగిపోయారు. ఈ క్రమంలోనే స్వగ్రామం విడిచి ఛప్రా జిల్లా ఎక్మాకు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ ఓ పిండి గిర్ని నిర్వహిస్తూ.. వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. ఎన్ని ఛీత్కారాలు ఎదురైనా సరే ఆడపిల్లలకు మంచి చదువు అందించాడు. తండ్రి బాధను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఆడపిల్లు చక్కగా చదువుకున్నారు.

ప్రస్తుతం ఈ ఏడుగురు అక్కా చెల్లెళ్లు వివిధ శాఖల్లో పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఛప్రా జిల్లాలో ‘సెబెన్ సిస్టర్స్’ పేర్లతో పాటు వారిని ఈ స్థాయికి తీసుకు వచ్చిన తండ్రి పేరు కూడా మార్మోగిపోతుంది. కమల్ సింగ్ దంపతులకు 8 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో ఒక కూతురు ఆరోగ్య పరిస్థితి బాగాలేక చిన్నతనంలోనే చనిపోయింది. తన పిల్లలను చిన్నప్పటి నుంచి చక్కగా చదివించాడు కమల్ సింగ్. వీరిలో ఒకరు 2006 లోనే సశస్త్ర సీమా బల్.. ఎస్‌ఎస్‌బీలో కానిస్టేబుల్ గా ఉద్యోగార్హత సాధించింది. అలా మిగతా అక్కా చెల్లెళ్లు తమ అక్కను ఆదర్శంగా తీసుకొని డిపార్ట్ మెంట్ లో చేరేందుకు ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలోనే మరో ఐదుగురు ఎక్సైజ్ శాఖ, సీఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ దళాలకు పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. ఏడుగురు కుమార్తెలు తల్లిదండ్రులు, సోదరుడి కోసం ఛప్రాలోని ఎక్మా బజార్ లో నాలుగంతస్తుల బిల్డింగ్ నిర్మించి బహుమతిగా ఇచ్చారు. ఈ ఇంటి నుంచి వస్తున్న అద్దెతో తాము ఎంతో సంతోషంగా జీవిస్తున్నామని కమల్ సింగ్ వెల్లడించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు నిరూపించారు.. వీరిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి