iDreamPost

జూలైలో సెమిస్టర్ పరీక్షలు … యూజీసీ మార్గదర్శకాలు

జూలైలో సెమిస్టర్ పరీక్షలు … యూజీసీ మార్గదర్శకాలు

కరోనా వైరస్ దెబ్బకు దేశమంతా అస్తవ్యస్ధమైన విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ కసరత్తు చేసింది. సెప్టెంబర్ నుండి నూతన విద్యా సంవత్సర ప్రారంభమవ్వాలని ఆదేశించింది. అలాగే ఏప్రిల్ నెలలో జరగాల్సిన పరీక్షలు మొత్తం వాయిదా పడ్డాయి. వాయిదాపడిన డిగ్రీ, పిజి పరీక్షలను జూలైలో పెట్టుకోవచ్చని యూజిసీ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

కరోనా దెబ్బకు విద్యాసంస్ధలు ఎప్పుడు ప్రారంభమవుతాయో, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలో యాజమాన్యాలకు అర్ధం కావటం లేదు. అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియ్ విద్యార్ధులకు కొన్ని పరీక్షలు మాత్రమే జరిగి మిగిలినవి వాయిదాపడ్డాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో అంటే సిబిఎస్ఇ సిలబస్ ఫాలో అయ్యే విద్యాసంస్ధల్లో మాత్రం కొన్ని పరీక్షలు జరిగి మిగిలినవి వాయిదాపడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రల్లో మాత్రం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తియిపోయాయి. కాకపోతే పరీక్షల పత్రాలను దిద్దటం, రిజల్ట్స్ ప్రకటించే ప్రక్రియ నిలిచిపోయింది.

ఒకవైపు యాజమాన్యాలు గందరగోళంలో ఉన్నా విద్యార్ధులు మాత్రం ఊహంచని రీతిలో సెలవులు రావటంతో పిచ్చ హ్యాపీగా ఉన్నారు. దాంతో అస్తవ్యస్ధమైన విద్యా సంవత్సరం విషయంలో యూజిసి నిపుణుల కమిటిలు పెద్ద కసరత్తే చేశాయి. దాని ఆధారంగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం జూలైలో డిగ్రీ, పిజి పరీక్షలుంటాయి.

ఒకసారి విద్యాసంస్ధలు మొదలైన తర్వాత వేలాదిమంది విద్యార్ధులు ఒకేచోట గుమిగూడటం ఖాయం. అలాగే స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు ఆటోల్లో, బస్సుల్లో క్రిక్కిరిసిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి విషయాలపైన కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. విద్యార్ధుల సంక్షేమం దృష్ట్యా ఉదయపు అసెంబ్లీలను, క్రీడా కార్యకలాపాలను కూడా రద్దు చేసింది. మాస్కులను యూనిఫారంతో పాటు తప్పనిసరి చేసింది.

క్యాటిన్ నిర్వహణలోను, విద్యాసంస్ధల భవనాలను డిస్ ఇన్ఫెక్షన్ చేయటంలో కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. షిఫ్టు పద్దతిలో తరగతులను నిర్వహించాలని కూడా చెప్పింది. యూజీసి ఇన్ని మార్గదర్శకాలను జారీ చేసినా ఎన్ని ఎన్ని యాజమాన్యాలు మార్గదర్శకాలను పాటిస్తాయో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి