iDreamPost

ప్రయాణికురాలు- TTE మధ్య ఘర్షణ.. ఆ రోజు రాత్రి ట్రైన్ లో ఏం జరిగిందంటే?

Lady TTE- Lady Passenger Issue Full Details: లేడీ టీటీఈ మీద మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన విషయం వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి జరిగింది ఇదే.

Lady TTE- Lady Passenger Issue Full Details: లేడీ టీటీఈ మీద మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన విషయం వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి జరిగింది ఇదే.

ప్రయాణికురాలు- TTE మధ్య ఘర్షణ.. ఆ రోజు రాత్రి ట్రైన్ లో ఏం జరిగిందంటే?

రైల్వే ప్రయాణికులు, టికెట్ కలెక్టర్ల మధ్య ఘర్షణలు, వివాదాలు చాలానే జరిగాయి. వారిపై దాడులు జరగడం కూడా చాలానే చూశాం. తాజాగా ఒక లేడీ ప్రయాణికురాలు- లేడీ టీటీఈ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో ఆ టీటీఈ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ దాడి ఘటన కాస్త వైరల్ గా మారింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? వారి మధ్య దాడికి గల కారణాలకు సంబంధించి అంతా వెతుకులాట మొదలు పెట్టారు. ఆ ఇద్దరు మహిళలు ఎందుకు పరస్పరం దాడి చేసుకున్నారు అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి జీఆర్పీ అధికారులు వివరాలు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం ఆ రాత్రి ఏం జరిగిందో చూద్దాం. గురువారం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన యశ్వంత్ పూర్- గోరఖ్ పూర్ రైలు ప్రయాణం ప్రారంభమైంది. ఆ రైలులో టీటీఈ అనీ విధుల్లో ఉన్నారు. టీటీఈ అనీ ప్రయాణికుల టికెట్లను చెక్ చేస్తున్నారు. ఆమె తన విధుల్లో భాగంగా ఎస్ 2 కోచ్ లో కూడా ప్రయాణికుల టికెట్లు పరిశీలిస్తూ ఉన్నారు. అప్పుడు ఎస్ 2 కోచ్ లో అయోధ్యకు వెళ్తున్న ప్రయాణికురాలు సమాగ్రిని సర్దుకుంటూ ఉంది. మౌలాలీ స్టేషన్ కు చేరుకున్న సమయంలో ఆ మహిళా ప్రయాణికురాలుకు మహిళా టీటీఈ అనీ తగిలిందంట.

ఆ తర్వాత వారి మధ్య మాటా మాటా పెరిగింది. వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం కాస్తా.. భౌతిక దాడికి దారి తీసింది. టీటీఈని ఆ మహిళా ప్రయాణికురాలు తోసేసింది. అలా తోయడంతో టీటీఈకి గాయాలయ్యాయి. ఆమెకు అప్పటికి మౌలాలీ రైల్వే స్టేషన్లో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత అనీని సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రికి తరలించారు. అక్కడ టీటీఈ అనీకి వైద్య చికిత్సలు అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనీని పలువులు అధికారులు పరామర్శించారు. దక్షిణ మధ్య సంఘ్ కు చెందిన కొందరు నేతలు కూడా అనీని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రయాణికురాలు సహా మరికొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి