iDreamPost

సౌదీ రాజ కుటుంబాన్ని చుట్టుముట్టిన కరోనా

సౌదీ రాజ కుటుంబాన్ని చుట్టుముట్టిన కరోనా

రాజు, పేద అనే భేదం ప్రభుత్వాలు, పాలకులు, చట్టాలు, న్యాయస్థానాలు చూపినా కరోనా వైరస్ మాత్రం చూపడం లేదు. మనవులందరూ తనకు సమానమేనని ఈ మహమ్మారి రుజువు చేసుకుంటోంది. మురికివాడల్లోని పేదల నుంచి, రాజా భవనాల్లోని రాజులు, రాణులు వరకూ అందరినీ కరోనా పలకరించింది. తాజాగా ఇసుక దేశంలో కరోనా తన ప్రతాపాన్ని చూపింది. సౌదీ రాజా కుటుంబానికి తన పవర్ ఏమిటో తెలియజేసింది. రాజా కుటుంబ లో ఒకరికో, ఇద్దరికో కాదు ఏకంగా 150 మందికి వైరస్ సోకింది.

రాజ కుటుంబ పై వైరస్ దాడి చేయడంతో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక ఆస్పత్రిని సిద్ధం చేసింది.

రియాజ్ లో విలాసవంతమైన, అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఉన్న 500 పడకల ఆస్పత్రిని రాజ కుటుంభం కోసం కేటాయించింది. రాజ కుటుంభం తో పాటు ఇతర ప్రముఖులకు ఈ ఆస్పత్రి వైద్య సేవలు అందించనుంది. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిని ఇతర ఆస్పత్రులకు తరలించింది.

ప్రపంచంలో పలు రాజ కుటుంబాలను, దేశాల పాలకులను ఇప్పటికే కరోనా పలకరించింది. స్పెయిన్ యువ రాణి మరియా థెరిస్సా ప్రాణాలు కోల్పోగా.. బ్రిటన్ యువరాజు కు వైరస్ సోకడం తో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు, ఆరోగ్య శాఖ మంత్రికి వైరస్ సోకింది. రష్యా, ఇజ్రాయెల్ ప్రధానులు పుతిన్, బెజిమెన్ నెతన్యాహులు సెల్ఫ్ క్యారంటైన్ లోకి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరచూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి