iDreamPost

అమ్మకానికి పాకిస్తాన్.. ఆ దేశం కొనుగోలు చేయనుందా..?

అమ్మకానికి పాకిస్తాన్.. ఆ దేశం కొనుగోలు చేయనుందా..?

దాయాదీ దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతుంది. ఇప్పటికే ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కోలుకోలేని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సగటు మానవ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. నిత్యావసర ధరలు నింగినంటడంతో ఏం తినలేని, కొనలేని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఆర్థిక అనిశ్చితి నుండి దేశం కోలుకుంటుందని పాలకులు చెబుతున్నా.. ఆ దాఖలాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు వెరసి.. జీడీపీలో భారీ క్షీణతను చవిచూస్తోంది పొరుగు దేశం. ఏం చేసేది లేక దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేసేందుకు పరాయి దేశాల చెంతకు సాయం కోసం చేతులు చాచుతోంది పాక్. అయితే ఈ దేశానికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది కుబేర దేశం సౌదీ అరేబియా.

పాకిస్తాన్‌ను ఆర్థిక ఒడిదుడుకులను గట్టేక్కించేందుకు సౌదీ అరేబియా భారీగా ధన సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో సౌదీ దేశపు రాజు మహ్మద్ బిన్ సల్మాన్ దాయాదీ దేశంలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఓ డీల్ కుదిరే అవకాశాలున్నాయి. ఒప్పందంలో భాగంగా పాక్‌ను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ రెండో వారంలో పాక్‌లో సల్మాన్ పర్యటిస్తారు. ఆయన పర్యటన కొన్ని గంటలు మాత్రమే ఉండనుంది. ఈ సమయంలోనే ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ని కలవనున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్న సంగతి విదితమే. ఈ సమయంలో మహ్మద్ బిన్ సల్మాన్ పర్యటించడం, పాక్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్రధారి అయిన ఆర్మీ చీఫ్‌ని కలుస్తుండటంతో పాక్ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ.. సౌదీ రాజు సల్మాన్ సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ అమ్మకానికి ఉందని, సౌదీ రాజు.. ఆ దేశాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉన్నారని వెల్లడించారు. ఆయన పర్యటనలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదరవచ్చునని, మొత్తం వివరాలు వెల్లడి అవుతాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం ఇందుకు సహకరించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైమైనప్పటికీ .. తన స్వయాంకృతాపరాధం కారణంగా పాకిస్తాన్ అనే దేశం అమ్మకానికి సిద్ధమైంది. కాగా, సౌదీ రాజు సల్మాన్ పాకిస్తాన్ పర్యటన అనంతరం భారత్  పర్యటన చేపట్టనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి