iDreamPost

సౌదీ అరేబియా గుప్పిట్లోకి IPL? బీసీసీఐ డెసిజనే కీలకం!

  • Author singhj Updated - 05:29 PM, Fri - 3 November 23

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి బంగారు బాతు లాంటిది ఐపీఎల్. అలాంటి ఐపీఎల్​ సౌదీ అరేబియా గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. ఐపీఎల్ సౌదీ గుప్పిట్లోకి వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి బంగారు బాతు లాంటిది ఐపీఎల్. అలాంటి ఐపీఎల్​ సౌదీ అరేబియా గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. ఐపీఎల్ సౌదీ గుప్పిట్లోకి వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Updated - 05:29 PM, Fri - 3 November 23
సౌదీ అరేబియా గుప్పిట్లోకి IPL? బీసీసీఐ డెసిజనే కీలకం!

క్రికెట్​లో ఇప్పుడు భారత్​దే ఆధిపత్యం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్​ (ఐసీసీ)పై మనదే పెత్తనం. భారత్ ఏం చెబితే ఐసీసీలో అదే చెల్లుబాటు అవుతుందనేది కాదనలేని వాస్తవమని అనలిస్టులు కూడా అంటుంటారు. అంతగా క్రికెట్​ ఫీల్డ్​తో పాటు క్రికెట్ ప్రపంచం మీద భారత్ డామినేషన్ చూపిస్తోంది. దీనంతటికీ కారణం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) దగ్గర ఉన్న సంపద, టీమిండియా క్రికెటర్లకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ కారణమని చెప్పొచ్చు. ఒకప్పుడు డబ్బుల్లేక ఎంతో ఇబ్బంది పడిన బీసీసీఐ.. ఇవాళ క్రికెట్​లో అత్యంత ధనిక బోర్డుగా ఉంది. ధనార్జనలో బీసీసీఐ ఈ రేంజ్​కు చేరుకోవడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్​ ఎంతో కీలకమని చెప్పొచ్చు.

ఐపీఎల్ రైట్స్, స్పాన్సర్​షిప్ ద్వారా ప్రతి ఏడాది బీసీసీఐ ఖజానాలో కోటాను కోట్లు వచ్చి పడుతున్నాయి. ఈ కాసుల లీగ్ వల్లే బీసీసీఐ ధనార్జన విషయంలో ఈ స్థాయిలో ఉంది. ఐసీసీలో బీసీసీఐ ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెల్లుబాటు అవ్వడం వెనుక ఇదే కారణమని చెప్పొచ్చు. ఐపీఎల్ ద్వారా ఇంటర్నేషనల్ మ్యాచులతో సంబంధం లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది భారత్. ఈ రెవెన్యూతోనే భారత్​లో క్రికెట్​ను నిర్వహిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లేకపోతే బీసీసీఐ పప్పులు ఉడకవని పలువురు అనలిస్టులు అంటున్నారు. అంతగా ఈ టోర్నమెంట్​పై డిపెండ్ అయింది.

భారత క్రికెట్ బోర్డుకు ఎంతో కీలకమైన ఐపీఎల్​లో ఇక సౌదీ అరేబియా డామినేషన్ నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పొట్టి టోర్నీలో ఇన్వెస్ట్ చేసేందుకు సౌదీ ముందుకొచ్చింది. ఐపీఎల్​లో ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని సౌదీ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. తమ ప్రపోజల్​ను బీసీసీఐ ముందు ఉంచిందట సౌదీ. ఒకవేళ దీనికి గనుక భారత క్రికెట్ బోర్డు ఓకే చెబితే క్రికెట్​లో ఇది పెను సంచలనమనే చెప్పాలి. ఈ డీల్ ఓకే అయితే ఐపీఎల్​లో క్రమంగా సౌదీ గుత్తాధిపత్యం మొదలవ్వడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే బీసీసీఐకి టోర్నీ ద్వారా ప్రతి ఏడాది వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.

ఐపీఎల్​లో సౌదీ ఇన్వెస్ట్​మెంట్​ ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో డబ్బులు వచ్చినా.. దీర్ఘకాలంలో ఇది భారత క్రికెట్​కు చేటు చేస్తుందని కొందరు అనలిస్టులు చెబుతున్నారు. కాసుల కక్కుర్తితో ఐపీఎల్​పై వేరే దేశానికి ఆధిపత్యం చేసే ఛాన్స్ ఇవ్వడం అస్సలు మంచిది కాదంటున్నారు. ఒక్కసారి ఇన్వెస్ట్​మెంట్​కు ఛాన్స్ ఇస్తే.. ఫ్యూచర్​లోనూ పెట్టుబడులు పెరిగిపోయి పూర్తిగా బీసీసీఐ చేతుల్లో నుంచి ఐపీఎల్ జారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతదాకా రానివ్వొద్దని.. సౌదీ ప్రపోజల్​కు వెంటనే నో చెప్పేయాలని బీసీసీఐకి కొందరు నెటిజన్స్ సూచిస్తున్నారు. అయితే సౌదీ ప్రపోజల్ విషయంలో ఎంత నిజం ఉందనేది బీసీసీఐకే తెలియాలి. మరి.. ఐపీఎల్​లో సౌదీ పెట్టుబడుల అంశంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: DRS తీసుకోవాలా? వద్దా? అనేది అతనికే వదిలేశా: రోహిత్‌ శర్మ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి