iDreamPost

వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే 5 సంవత్సరాల జైలు శిక్ష.. రూ. 20 లక్షల జరిమానా!

  • Author Soma Sekhar Published - 03:34 PM, Tue - 1 August 23
  • Author Soma Sekhar Published - 03:34 PM, Tue - 1 August 23
వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే 5 సంవత్సరాల జైలు శిక్ష.. రూ. 20 లక్షల జరిమానా!

నేటి టెక్నాలజీ యుగంలో ఏం తెలియాలన్నా.. ఏం చెప్పాలన్న అరచేతిలో ఉన్న ఫోన్ నుంచే అన్ని జరుగుతున్నాయి. ఇక ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్తకొత్త అప్డేట్స్ తో అందరిని ఆకట్టుకుంటూ ముందుకుసాగుతోంది. అయితే ఇంతకు ముందులా వినియోగదారులు వాట్సాప్ లో మెసేజ్ లు టైప్ చేయట్లేదు. ఏ విషయాన్నైనా ఎమోజీల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే అడ్డదిడ్డంగా ఎమోజీలు పంపిస్తే.. ఇక నుంచి జైలుకు వెళ్లాల్సి వస్తుందట. ఈ కొత్తరూల్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

నేటి ఆధునిక యుగంలో మనిషి లేవగానే ముందుగా ముట్టుకునేది సెల్ ఫోనే. అంతలా ఫోన్ మన జీవితంలో భాగమై పోయింది. ఇక ప్రతిరోజూ వాట్సాప్ వాడకుండా మనం ఉండలేం అంటే అతిశయోక్తికాదు. ఫ్రెండ్స్ తోని, కుటుంబ సభ్యులతోని ఏదైనా చెప్పదలచినప్పుడు ఎక్కువగా వాట్సాప్ నే యూజ్ చేస్తుంటారు. అయితే గతంలో ఎక్కువగా మెసేజ్ లు టైప్ చేసి చెప్పేవారు. కానీ రానురాను టైప్ చేయడం మర్చిపోయారు యూజర్స్. ఇప్పుడంతా.. ఎమోజీల కాలం వచ్చేసింది. మాటల కంటే ఎమోజీలతోనే ఎక్కువగా తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు నేటి జనాలు. ఎక్కువగా రెడ్ కలర్ హార్ట్ ఎమోజీనే వాడుతుంటారు.

అయితే ఇక నుంచి మీ ఇష్టం వచ్చినట్లు హార్ట్ ఎమోజీలు పంపిస్తే.. జైలుకు వెళ్లాల్సిందే. ఈ రూల్ తెచ్చింది ఇండియాలో కాదులేండి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కఠినమైన రూల్ సౌదీ అరేబియా తీసుకుంది. ఇక నుంచి సౌదీ అరేబియాలో రెడ్ కలర్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేదింపులతో సమానమని తాజాగా ప్రకటించింది. వాట్సాప్ లో హార్ట్ సింబల్ పంపితే.. రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటుగా, రూ. 20 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా ఇలాంటి ఎమోజీలు పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది సౌదీ అరేబియా ప్రభుత్వం.

కాగా.. ఇదే నేరం మళ్లీ చేస్తే.. 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా రూ. 60 లక్షల జరిమానా విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాండ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు. ఇప్పటికే ప్రపంచంలో లేని కొత్త కొత్త ఆంక్షలు అమలులో ఉన్న సౌదీ అరేబియాలో తాజాగా ఇలాంటి కొత్త రూల్ ను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇక ఈ నిర్ణయం తీసుకురావడానికి ఓ కారణాన్ని చెప్పింది సౌదీ ప్రభుత్వం. తెలియని వ్యక్తులతో చాటింగ్ చేసి, చిక్కుల్లో పడకుండా సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్ గా మార్చడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరి సౌదీ అరేబియా తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్‌.. వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి