ఆటల్లో గెలుపోటముల తర్వాత అంతగా ప్రాధాన్యం ఇచ్చేది రికార్డుల గురించే. కొన్నిసార్లు సక్సెస్ కంటే కూడా రికార్డులు ఎక్కువ కిక్‌ను ఇస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఓటమి బాధ నుంచి రికార్డులే తేరుకునేలా చేస్తాయి. ఓడిపోయినా పర్లేదు.. తమ ఫేవరెట్ టీమ్ లేదా ప్లేయర్ ఫలానా రికార్డు సాధించారని గుర్తుచేసుకుంటూ అభిమానులు ఆ బాధను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తారు. రికార్డులు, మైలురాళ్ల విషయంలో మిగతా ఆటల్లాగే క్రికెట్ కూడా అని చెప్పొచ్చు. జెంటిల్మన్ గేమ్‌లో జరిగే విశేషాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపే ఫ్యాన్స్‌కు ఈ రికార్డుల పట్టింపులు మరీ ఎక్కువగా ఉంటాయి. ఏ ప్లేయర్ సెంచరీ కొట్టాడు, ఎవరు ఎన్ని వికెట్లు తీశారో లాంటివి క్రికెట్లో ఎప్పడూ ఆసక్తికరమే.
ఇదిలాఉంటే.. పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సౌద్ షకీల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో అతడు అద్భుతమైన ఫీట్‌ను నమోదు చేశాడు. లంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) బాదిన తొలి పాక్ క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో శ్రీలంకలో హయ్యెస్ట్ స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (169) పేరిట ఉండేది. సీనియర్ బ్యాటర్ హఫీజ్ రికార్డును ఈ మ్యాచ్‌లో షకీల్ తిరగరాశాడు. పెద్దగా అనుభవం లేని అతడికి ఇది కేవలం ఆరో టెస్టు మ్యాచే కావడం గమనార్హం. అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేశాడు షకీల్.
లంకతో టెస్టులో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన షకీల్.. పర్సనల్ రికార్డుతో పాటు టెయిలెండర్ల సాయంతో తన టీమ్‌కు అతిమూల్యమైన రన్స్ సమకూర్చాడు. 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగాడు షకీల్. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) అండతో తన టీమ్‌కు భారీ స్కోరును అందించాడు. షకీల్ ద్విశతకం బాదేయడంతో పాక్ 461 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆతిథ్య జట్టు బౌలర్లలో రమేష్ మెండిస్ 5 వికెట్లతో చెలరేగాడు. ప్రభాత్ జయసూర్య 3, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత తలో వికెట్‌తో రమేష్‌కు చక్కటి సహకారం అందించారు.
💯 HISTORY MADE 💯
Saud Shakeel becomes the first Pakistan batter to score a double hundred in Sri Lanka!#SLvPAK LIVE ➡️ https://t.co/q2j3h8lRtc pic.twitter.com/pYIawomfcT
— ESPNcricinfo (@ESPNcricinfo) July 18, 2023