iDreamPost

10th పాసైతే చాలు.. వేలల్లో స్కాలర్ షిప్.. ఇలా అప్లై చేసుకోండి

మీరు పదోతరగతి పాసయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఉన్నత చదువులు చదివేందుకు వేలల్లో స్కాలర్ షిప్ అందిస్తోంది ఓ సంస్థ. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు పదోతరగతి పాసయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఉన్నత చదువులు చదివేందుకు వేలల్లో స్కాలర్ షిప్ అందిస్తోంది ఓ సంస్థ. వెంటనే అప్లై చేసుకోండి.

10th పాసైతే చాలు.. వేలల్లో స్కాలర్ షిప్.. ఇలా అప్లై చేసుకోండి

నేటి రోజుల్లో ఎడ్యుకేషన్ కాస్ట్లీగా మారిపోయింది. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక పరిస్థితి అందరికీ ఒకేలా ఉండదు కదా. అందుకే చాలా మంది విద్యార్థులు తమలో అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక లేమి కారణంగా మధ్యలోనే చదువులను ఆపేస్తుంటారు. ఇలాంటి విద్యార్థులను ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ ను అందిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలే కాకుండా కొన్ని సంస్థలు కూడా స్కాలర్ షిప్స్ ను అందిస్తున్నాయి. మరి మీరు పదో తరగతి ఉత్తీర్ణులైతే గుడ్ న్యూస్. ఏకంగా వేలల్లో స్కాలర్ షిప్ అందుకునే ఛాన్స్ వచ్చింది.

మీరు టెన్త్ క్లాస్ పాసైతే చాలు ఉపకార వేతనం పొందొచ్చు. ఈ స్కాలర్ షిప్స్ ను సరోజిని దామోదరన్ సంస్థ అందిస్తోంది. ప్రతీ సంవత్సరం పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు విద్యాదాన్‌ పేరిట ఉపకార వేతనాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇంటర్ తో పాటు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ ను పొందొచ్చు. ఈ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌, గోవా, మహారాష్ట్ర, లడఖ్​, పుదుచ్చేరి, దిల్లీ, బిహార్​, పంజాబ్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తర్ ​ప్రదేశ్​ తదితర ప్రాంతాల్లోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.

సరోజిని దామోదరన్ సంస్థ అందించే స్కాలర్ షిప్ పొందడానికి విద్యార్థులు టెన్త్ లో 90% మార్కులతో ఉత్తీర్ణత లేదా 9 జీపీఏ సాధించి ఉండాలి. దివ్యాంగులైతే 75% మార్కులు లేదా 7.5 జీపీఏ సాధిస్తే సరిపోతుంది. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.10 వేలు స్కాలర్ షిప్ అందిస్తారు. అలాగే ప్రతిభ కనబరుస్తూ ఉన్నత చదువులకు వెళ్లే అభ్యర్థులకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు అందిస్తారు. విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 15 చివరి తేదీ. ఏపీలో జూన్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి