iDreamPost

టీమిండియాపై పాక్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు! పాక్‌తో పోల్చుకుంటే..

  • Published Aug 12, 2023 | 1:14 PMUpdated Aug 12, 2023 | 1:14 PM
  • Published Aug 12, 2023 | 1:14 PMUpdated Aug 12, 2023 | 1:14 PM
టీమిండియాపై పాక్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు! పాక్‌తో పోల్చుకుంటే..

టీమిండియాపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ నవాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సర్వనాశనం అవుతుందంటూ పేర్కొన్నాడు. టీమిండియా చేస్తున్న ప్రయోగాలు ఆ జట్టును పటిష్టం చేయడానికి బదులు.. నాశనం చేస్తున్నాయని, టీమిండియాతో పోల్చుకుంటే.. పాకిస్థాన్‌ టీమ్‌ ఎంత పటిష్టంగా ఉందంటూ వెల్లడించాడు. వెస్టిండీస్‌ టూర్‌లో భాగంగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా చేసిన ప్రయోగాలపై స్పందిస్తూ అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. రానున్న ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌లను దృష్టిలో పెట్టుకుంటే.. టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌పై ఇంకా స్పష్టత లేదని అన్నాడు.

అయితే.. టీమిండియాలోని బెంచ్‌ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌, సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అసలు బ్యాటింగ్‌కు రాలేదు. జట్టులోని యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, గిల్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ లాంటి వారికి బ్యాటింగ్‌ చేసే అవకాశం కల్పించారు. అయితే.. తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ ఆడినా.. రోహిత్‌ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, కోహ్లీ అసలు బ్యాటింగే రాలేదు. దాంతో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సైతం అష్టకష్టాలు పడింది. దీంతో.. టీమిండియా యువ క్రికటెర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇవే ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేయగా భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో కోహ్లీ, రోహిత్‌ టీమ్‌లో లేకుండా టీమిండియా ఓ పసికూన జట్టు అంటూ విమర్శలు వచ్చాయి. కానీ, మూడో వన్డేలో యువ క్రికెటర్లు చెలరేగి.. విమర్శలకు చెక్‌ పెట్టారు. అయితే.. మళ్లీ టీ20 సిరీస్‌లో యువ క్రికటెర్లు విఫలం అవుతున్నారు. దీంతో ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ ఆడే జట్టుపై ఇంకా స్పష్టత రావడం లేదు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జడేజా, సిరాజ్‌, షమీ తప్ప.. టీమ్‌లో ఉండే మిగతా ఆటగాళ్ల ఎవరో తెలియదు. కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌ గాయాల నుంచి కోలుకుంటున్నారు. వీరు అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. వీరు కాకుండా యువ క్రికెటర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. వారిని పరీక్షించేందుకు చేస్తున్న ప్రయోగాలు విఫలం అవుతున్నాయి. ఇదే విషయంపై పాక్‌ మాజీ క్రికెటర్‌ నవాజ్‌ స్పందిస్తూ.. కెప్టెన్లు మార్చడం, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తరుచు మార్పులు చేయడం టీమిండియాను నాశనం చేస్తుందంటూ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఒక్క ఇన్‌స్టా పోస్టుకు రూ.11 కోట్లకు పైనే..! భారీ ట్విస్ట్‌ ఇచ్చిన కోహ్లీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి