iDreamPost

సంక్రాంతి విజేత ఎవరు

సంక్రాంతి విజేత ఎవరు

సంక్రాంతి పోరు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. దానికి తగ్గట్టే ఆయా సినిమాల యూనిట్లు ప్రమోషన్ వేగాన్ని పెంచాయి. మేమంటే మేము విన్నర్స్ అంటూ ఇటీవలి కాలంలో ఆగిపోయిన కలెక్షన్ ఫిగర్ల పబ్లిసిటీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. రోజుకు రెండో మూడో వీడియో ప్రోమోలు పోస్టర్లు నాన్ స్టాప్ గా వదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ట్రేడ్ అధికారికంగా ఎవరు విన్నర్ అనేది చెప్పలేకపోతోంది కానీ వసూళ్ల ట్రెండ్ ని బట్టి చూస్తే అల వైకుంఠపురము ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటోందన్నది వాస్తవం.

అలా అని సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ పూర్తిగా తగ్గాయని కాదు. సెలవులు కాబట్టి బుకింగ్స్ బాగానే ఉన్నాయి. తెలుగు వాళ్లకు ప్రధాన వినోద సాధనం సినిమానే కాబట్టి ఏదో ఒకటి చూసే తీరాలి అన్న తరహాలో దొరికితే బన్నీ లేకపోతే మహేష్ ఫార్ములాతో రెండూ హౌస్ ఫుల్స్ చేస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో హాలిడేస్ పూర్తయిపోయి స్కూళ్ళు కాలేజీలు తెరుచుకుంటాయి. అప్పుడు అసలు సత్తా బయటపడుతుంది

రజనీకాంత్ దర్బార్ కథ దాదాపు ముగిసినట్టే. 15 కోట్ల బిజినెస్ కు ఇప్పటిదాకా వచ్చింది 7 కోట్లేనని తెలిసింది. ముందే చేసుకున్న ఒప్పందాల వల్ల థియేటర్లలో కొనసాగిస్తున్నారు కానీ ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఆల్రెడీ డెఫిసిట్ లోకి వెళ్లిందని సమాచారం. ఇక ఎంత మంచివాడవురాకు రిపోర్ట్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. పండగ ఎఫెక్ట్ వల్లే దీనికీ వసూళ్లు వస్తున్నాయి కానీ వచ్చే వారం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఓవర్ సీస్ విషయానికి వస్తే వీక్ డేస్ లో అల వైకుంఠపురములో ఆధిపత్యం కొనసాగుతోంది. అక్కడి అంచనాల ప్రకారం బన్నీ సినిమా 3 మిలియన్ల దరిదాపుల్లోకి వెళ్లే అవకాశం ఉండగా సరిలేరు రెండున్నర లోపే ఆగిపోవచ్చని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్పష్టత ఇంకో నాలుగైదు రోజుల్లో వచ్చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి