iDreamPost

SRHపై ఘన విజయం.. RCBకి ప్లే ఆఫ్‌ ఛాన్స్‌!

  • Published Apr 26, 2024 | 7:42 AMUpdated Apr 26, 2024 | 7:42 AM

RCB, Playoffs, IPL 2024: ఈ సీజన్‌లో ఎట్టకేలకు ఆర్సీబీకి రెండో విజయం దక్కింది. పటిష్టమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో.. ఆ జట్టులో మళ్లీ ప్లే ఆఫ్‌ అవకాశాలు చిగురించాయి.

RCB, Playoffs, IPL 2024: ఈ సీజన్‌లో ఎట్టకేలకు ఆర్సీబీకి రెండో విజయం దక్కింది. పటిష్టమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో.. ఆ జట్టులో మళ్లీ ప్లే ఆఫ్‌ అవకాశాలు చిగురించాయి.

  • Published Apr 26, 2024 | 7:42 AMUpdated Apr 26, 2024 | 7:42 AM
SRHపై ఘన విజయం.. RCBకి ప్లే ఆఫ్‌ ఛాన్స్‌!

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయం సాధించింది. గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌ కంటే ముందు భీకర ఫామ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆర్సీబీపై చాలా సులువుగా గెలుస్తుందని, తొలుత బ్యాటింగ్‌ చేస్తే 300లకి పైగా స్కోర్‌ చేస్తుందని చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ, కథ అడ్డం తిరిగింది. ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ తలొంచింది. అయితే.. ఈ విజయంతో ఆర్సీబీలో మళ్లీ ప్లే ఆఫ్‌ ఆశలు చిగురించాయి. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 2 విజయాలు సాధించి.. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉంది. అయితే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే చాలా కష్టమే కానీ, అసాధ్యమైతే కాదు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కొన్ని అద్భుతాలు జరగాలి. అవేంటో ఇప్పుడు​ వివరంగా తెలుసుకుందాం..

ఆర్సీబీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. మొత్తం 14 పాయింట్లు ఆర్సీబీ ఖాతలో ఉంటున్నాయి. 14 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌పై ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు. 14 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లదు. కానీ, ఇతరు టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడొచ్చు. ఆర్సీబీకి మేలు చేస్తూ.. కొన్ని టీమ్స్‌ గెలుస్తూ, మరికొన్ని టీమ్స్‌ ఓడిపోతూ ఉండాలి. కొన్ని మ్యాచ్‌లు రద్దు అయితే.. ఆర్సీబీకి ఇంకా ప్లస్‌ అవుతుంది. కాగా, ఏ మ్యాచ్‌ ఎవరు గెలవాలి, ఏ మ్యాచ్‌లో ఏ టీమ్‌ ఓడిపోవాలి, ఏ మ్యాచ్‌ రద్దు కావాలి.. ఇలాంటి విషయాలన్ని లెక్కలేస్తే బుర్ర బద్దలు అవ్వడం ఖాయం. కానీ, ఇప్పటికీ ఆర్సీబీకి ప్లే ఆఫ్‌ అవకాశాలు అయితే పూర్తిగా మూసుకోపోలేదు. ఇంకా సజీవంగానే ఉన్నాయి. కానీ, చాలా అంటే చాలా సంక్లిష్టంగా ఉన్నాయి.

Big win over SRH gives RCB a play off chance!

ఇతర టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడే ముందు.. ఆర్సీబీ మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించాలి. రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవాలి. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే చందానా.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరినా చేరవచ్చు. ఆర్సీబీ ఇతర టీమ్స్‌పై ఆధారపడాల్సి వచ్చినా.. ముందు తమ చేతుల్లో ఉన్న పనిని వంద శాతం పూర్తి చేయాలి. ప్రస్తుతం ఆర్సీబీ టీమ్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. మిగిలిన మ్యాచ్‌లు గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయినా కూడా ఆశ పట్టుకోవడంలో తప్పులేదు. పైగా ఆర్సీబీ టీమ్‌ను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. 2016 సీజన్‌లో తొలి 7 మ్యాచ్‌లలో ఒక్క విజయం మాత్రమే సాధించిన ఆ జట్టు.. తర్వాత వరుస విజయాలతో ఏకంగా ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో అలాంటి అసాధారణ ప్రదర్శనతో పాటు.. భారీగా అదృష్టం కలిసి వస్తే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. మరి ఆర్సీబీ ప్లే ఆఫ్‌ ఛాన్సులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి