iDreamPost

గదిని చల్లగా చేయడంలో ACలతో పోటీ పడే కూలర్స్.. మార్కెట్ లో బెస్ట్ ఇవే!

  • Published Apr 25, 2024 | 10:24 PMUpdated Apr 25, 2024 | 10:24 PM

ప్రస్తుతం సమ్మార్ సీజన్ కావడంతో ఎండలు ఎన్నాడు లేని విధంగా దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఏసీలు, కూలర్ ల వెంట పడుతున్నారు. అలాంటి వారి కోసం దేశంలో అతి తక్కువ ధరకే టాప్ బ్రాండెడ్ కూలర్ లు అందుబాటులో ఉన్నాయి. మరి, ఆ కూలర్ల వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం సమ్మార్ సీజన్ కావడంతో ఎండలు ఎన్నాడు లేని విధంగా దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఏసీలు, కూలర్ ల వెంట పడుతున్నారు. అలాంటి వారి కోసం దేశంలో అతి తక్కువ ధరకే టాప్ బ్రాండెడ్ కూలర్ లు అందుబాటులో ఉన్నాయి. మరి, ఆ కూలర్ల వివరాలను తెలుసుకుందాం.

  • Published Apr 25, 2024 | 10:24 PMUpdated Apr 25, 2024 | 10:24 PM
గదిని చల్లగా చేయడంలో ACలతో పోటీ పడే కూలర్స్.. మార్కెట్ లో బెస్ట్ ఇవే!

ప్రస్తుతం ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా విధంగా ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. కాగా, ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అలాగే అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడటంతో.. ప్రజలు బయటకు వెళ్లలంటేనే భయపడుతున్నారు. అలా అని ఇంట్లో ఉన్న విపరీతమైన ఉక్కపోత, వేడి ఆవిరితో ప్రజలను ఉక్కిరిబిక్కరి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అధిక ఎండల నుంచి రక్షణకు చాలా మంది వివిధ జాగ్రత్తాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్లయితే ఈ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు.. ఏసీలు, కూలర్ ల వెంట పడుతున్నారు.అయితే ప్రస్తుతం కూలర్లతో పోలిస్తే ఏసీలు అధిక ధరల్లో ఉంటాయి. అందుకోసం దేశంలో ఇప్పుడు టాప్ బ్రాండెడ్ కూలర్ లు అందుబాటులో ఉన్నాయి. మరి, ఆ కూలర్ల వివరాలను తెలుసుకుందాం.

సింఫనీ డైట్ 12 టీ

 ఈ సింఫనీ డైట్ 12టీ అనేది పర్సనల్ టవర్ ఎయిర్ కూలర్ ఫర్ హోమ్ కు అత్యంత సరసమైన ధరల్లో వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. ఇక ఈ సింఫనీ ఎయిర్ కూలర్ అనేది వేడి, తేమతో కూడిన వేసవి కాలంలో కూడా మీ ఇంట్లో చల్లగా ఉండేలా చేస్తుంది. పైగా ఇంటి కోసం సింఫనీ ఎయిర్ కూలర్ 3-సైడ్ హనీకోంబ్ ప్యాడ్‌లతో వస్తుంది. అలాగే హెవీ-డ్యూటీ 170 వాట్ మోటార్‌తో నడిచే శక్తివంతమైన బ్లోవర్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ ఎయిర్ కూలర్‌కు సంబంధించిన ఐ-ప్యూర్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ధర పరిధిలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఉంటుంది.

క్రాంప్టన్ ఓజోన్ రాయల్ 75 టీ

ఇక క్రాంప్టన్ ఓజోన్ రాయల్ 75 లీటర్ డెసర్ట్ ఎయిర్ కూలర్ అనేది చాలా అద్భుతంగా నిర్మాణ నాణ్యతతో ఆకర్షిస్తుంది. పైగా ఈ ఎయిర్ కూలర్ అవుటర్ పార్ట్ అధిక నాణ్యత కలిగిన ఫైబర్‌తో తయారు చేయడం వల్ల అత్యంత బలంగా ఉంటుంది.

డీఎంహెచ్ 65 నియో

అలాగే బజాజ్ డీఎంహెచ్ నియో 65 ఎల్ డెసర్ట్ ఎయిర్ కూలర్ కూడా అత్యధిక ఫీచర్స్ తో వస్తుంది. కాగా, ఈ ఎయిర్ కూలర్ అనేది మీ గది మొత్తం కొన్ని సెకన్లలో చల్లగా ఉండేలా చేస్తుంది.  అలాగే 65 లీటర్ల వాటర్ ట్యాంక్ లోపల ఉన్న ప్యాడింగ్‌లోని ప్రతి మూలకు నీటిని పంప్ చేసేలా చేస్తుంది. దీని వలన కూలర్ నుంచి వచ్చే గాలి అనేది చాలా చల్లగా ఉంటుంది.

క్యాండిస్ 12 ఎల్

ఇక  క్యాండిస్ 12 ఎల్ పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్ అనేది అతి చిన్న ఎయిర్ కూలర్ గా ఉంది. పైగా ఇది చిన్న గది, క్యాబిన్ కోసం సరైన ఎంపికగా ఉంటుంది. అంతేకాకుండా.. ఈ కూలర్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించడానికి చాలా సులువుగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పోర్టబుల్ ఎయిర్ కూలర్ అని చెప్పవచ్చు. ఇక ఈ కూలర్ పనితీరు విషయంలో ఎలాంటి సందేహం లేదు.

ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరా చిల్

ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్ 40 ఎల్ పోర్టబుల్ ఎయిర్ కూలర్ అనేది ప్రస్తుత సీజన్‌లో సరిగ్గా సరిపోతుంది. పైగా శక్తివంతమైన ఎయిర్ కూలర్ 40 లీటర్ వాటర్ ట్యాంక్‌తో ఇది వస్తుంది. అందువల్ల ప్రతిసారి ట్యాంక్‌ను ఫుల్ చేయాలని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక ఈ కూలర్ శక్తివంతమైన మోటారు పంచ్‌ను ప్యాక్ చేస్తుంది. అలాగే ప్రత్యేకమైన ఏరోఫాన్ టెక్నాలజీతో ఎయిర్ కూలర్ 40ఎల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న ఇతర ఎయిర్ కూలర్‌లతో పోలిస్తే 17 శాతం ఎక్కువ ఎయిర్ డెలివరీని అందిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి