ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌కు తనను సెలక్ట్ చేయలేదన్న కోపంలో ఉన్న టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ కసితో ఆడుతున్నాడు. వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు.
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌కు తనను సెలక్ట్ చేయలేదన్న కోపంలో ఉన్న టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ కసితో ఆడుతున్నాడు. వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు.
భారత క్రికెట్ టీమ్‌లోకి అడుగు పెట్టేందుకు ఎంతో మంది క్రికెటర్లు ఎదురు చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. జట్టులో సెటిలైపోదామని తహతహలాడుతున్నారు. అయితే కొందరు ప్లేయర్లకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన టీమ్‌లో కుదురుకోవడం లేదు. టీమ్ మేనేజ్మెంట్ వారిపై నమ్మకం ఉంచి వరుసగా ఛాన్సులు ఇస్తున్న తమ సత్తాను ప్రూవ్ చేసుకోవడం లేదు. డొమెస్టిక్, ఐపీఎల్ లెవల్లో రాణిస్తున్న క్రికెటర్స్ తీరా ఇంటర్నేషనల్ మ్యాచులకు వచ్చే సరికి అదే లెవల్లో పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. కొందరికి టీమ్ మేనేజ్మెంట్ వరుస ఛాన్సులు ఇస్తుంటే.. మరికొందరి విషయంలో మాత్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
యంగ్ బ్యాటర్ సంజూ శాంసన్ విషయంలో సెలెక్టర్లు, భారత టీమ్ మేనేజ్మెంట్ పక్షపాతంగా వ్యవహరించిందనే విమర్శలు చాలాసార్లు వచ్చాయి. అందుకు కారణం ఈ కేరళ బ్యాట్స్‌మన్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వకపోవడమేనని అనొచ్చు. అప్పుడెప్పుడో 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన సంజూ.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. టీమిండియాలో అతడు పర్మినెంట్ మెంబర్ కాలేకపోయాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ సంజూక్ చోటు దక్కలేదు. సంజూకు అన్యాయం జరిగిందని అతడి ఫ్యాన్స్‌తో పాటు కొందరు సీనియర్లు కూడా కామెంట్స్ నెట్టింట కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
సంజూ విషయంలో భారత సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ పూర్తి తప్పని చెప్పలేం. ఎందుకంటే తీవ్ర పోటీ ఉన్న టీమిండియాలో ఒక ప్లేయర్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి. సంజూ కూడా తనకు వచ్చిన కొన్ని ఛాన్సులను పూర్తిగా సద్వినియోగం చేసుకొని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని గెలుచుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో! ఇక, తనను వరల్డ్ కప్ టీమ్‌కు సెలెక్ట్ చేయకపోవడంపై సీరియస్‌గా ఉన్న సంజూ.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో బ్యాట్‌తో అదరగొడుతున్నాడు.
ఇటీవల చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంజూ (32 బంతుల్లో 52).. తాజాగా ఒడిశాతో మ్యాచ్‌లోనూ మరోమారు ఫిఫ్టీ రన్స్ బాదాడు. ఈసారి 31 బంతుల్లోనే ఏకంగా 55 రన్స్ చేశాడు. అతడితో పాటు వరుణ్ నాయనార్ (48), విష్ణు వినోద్ (35) రాణించడంతో 20 ఓవర్లలో కేరళ 183 రన్స్ చేసింది. అయితే ఛేజింగ్‌లో ఒడిశా 133 రన్స్‌కే ఆలౌట్ అయింది. వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్న సంజూ శాంసన్‌ను ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. అతడు మాస్ హిట్టింగ్తో సెలెక్టర్లకు వార్నింగ్ పంపాడని అంటున్నారు. మరి.. సంజూ బ్యాటింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ద్రవిడ్కో న్యాయం.. ప్లేయర్లకో న్యాయమా? BCCI తీరుపై నెటిజన్స్ ఫైర్!
THE SANJU SAMSON SHOW…!!!
55* (31) with 4 fours and 4 sixes in the Syed Mushtaq Ali Trophy for Kerala. A captain’s knock by Sanju. pic.twitter.com/9avGcJtHxZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 25, 2023