iDreamPost
android-app
ios-app

Sanju Samson: ఓటమిలోనూ శాంసన్ గొప్ప మనసు! ఇంత మంచి వాడినా ఇన్నాళ్లు దూరం పెట్టింది!

  • Published May 08, 2024 | 1:26 PM Updated Updated May 08, 2024 | 1:26 PM

ఓటమి బాధలో ఉన్నప్పటికీ శాంసన్ గొప్ప మనసును చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడిన మాటలు వింటే.. హ్యాట్సాఫ్ అనాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓటమి బాధలో ఉన్నప్పటికీ శాంసన్ గొప్ప మనసును చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడిన మాటలు వింటే.. హ్యాట్సాఫ్ అనాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

Sanju Samson: ఓటమిలోనూ శాంసన్ గొప్ప మనసు! ఇంత మంచి వాడినా ఇన్నాళ్లు దూరం పెట్టింది!

సంజూ శాంసన్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్  గా ముందుకు సాగుతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ టీమ్ ను తన నాయకత్వంలో అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ దుమ్మురేపుతున్నాడు ఈ స్టార్ వికెట్ కీపర్. ఇక తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయాని నిలువునా బలైయ్యాడు. దాంతో తన టీమ్ ఓటమిపాలైంది. అయినప్పటికీ తప్పును అంపైర్ల మీదకి నెట్టకుండా.. మ్యాచ్ ఓడాక అతడు మాట్లాడిన మాటలు అందరి మనసులను దోచుకుంటున్నాయి. ఆ మాటలు వింటే మీరు హ్యాట్సాఫ్ అనాల్సిందే.

ఒకపక్క తప్పుడు ఔట్.. మరోపక్క మ్యాచ్ ఓడిపోయింది. దాంతో సహజంగానే ఏ క్రికెటర్ అయినా, కెప్టెన్ అయినా బాధపడతాడు. కానీ సంజూ శాంసన్ అలా కాదు. తమ ఓటమిని అన్యాయంగా ఔట్ ఇచ్చిన అంపైర్లపై నెట్టలేదు. ప్రత్యర్థి ప్లేయర్ల అద్భుతమైన ఆటతీరుకు క్రెడిట్ ఇచ్చాడు. అయితే సునామీ ఇన్నింగ్స్ ఆడిన జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ కు ఈ గెలుపు క్రెడిట్ ఇచ్చాడు అనుకుంటే పొరపాటే. అలా అని వారి గేమ్ ను తక్కువ చేసి చూపలేదు. వారిద్దరి బ్యాటింగ్ సైతం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు శాంసన్.

ఈ క్రమంలోనే సౌతాఫ్రికా చిచ్చర పిడుగు ట్రిస్టన్ స్టబ్స్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్ లు అద్భుతంగా ఆడారు. కానీ ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్ చేసి తీరు అమోఘం. మరీ ముఖ్యంగా అతడు మా బెస్ట్ బౌలర్ అయిన సందీప్ శర్మ బౌలింగ్ లో ఆడిన షాట్స్ సూపర్. నా అభిప్రాయాం ప్రకారం ఈ గెలుపు క్రెడిట్ స్టబ్స్ కే. అతడు సందీప్ ను ఎదుర్కొన్న తీరు నన్ను ముచ్చటగొలిపింది.” అంటూ స్టబ్స్ పై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం శాంసన్ ఇచ్చిన స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఓడిపోయిన బాధలో కూడా ఇలా మాట్లాడటం నీకే సాధ్యం సంజూ.. ఇలాంటి ఆట, మనస్తత్వం ఉన్న నిన్ను ఇన్నాళ్లు పక్కనపెట్టడం బాధాకరం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 86 పరుగుల ఒంటరి పోరాటం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అంపైర్ల తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. మరి మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)