iDreamPost

టీ20 వరల్డ్ కప్ లో వారిద్దరికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్స్ ఉండాలి, లేకపోతే..!: విండీస్ దిగ్గజం

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఓ సలహా ఇచ్చాడు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా. టీ20 వరల్డ్ కప్ లో ఆడే ఆ స్టార్ ప్లేయర్ల కోసం ప్రత్యేక ప్లాన్స్ రెడీ చేసుకోవాలని సూచించాడు. మరి ఆ స్టార్ ప్లేయర్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఓ సలహా ఇచ్చాడు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా. టీ20 వరల్డ్ కప్ లో ఆడే ఆ స్టార్ ప్లేయర్ల కోసం ప్రత్యేక ప్లాన్స్ రెడీ చేసుకోవాలని సూచించాడు. మరి ఆ స్టార్ ప్లేయర్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ లో వారిద్దరికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్స్ ఉండాలి, లేకపోతే..!: విండీస్ దిగ్గజం

ఒకవైపు ఐపీఎల్ 2024 జరుగుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం జూన్ లో ప్రారంభం అయ్యే టీ20 ప్రపంచ కప్ పైనే ఉంది. ఈ మెగాటోర్నీ కోసం పాల్గొంటున్న 20 జట్లు తమ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే టీమిండియా మాత్రం ఇప్పటికే ఈ పొట్టి ప్రపంచ కప్ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. తన అస్త్ర శస్త్రాలకు పదునుపెడుతోంది. యంగ్ ప్లేయర్లను టీమ్ లోకి తీసుకుని, సీనియర్లతో కలిసి ఎలాగైనా పొట్టి కప్ కొట్టాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఓ సలహా ఇచ్చాడు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా. ఆ స్టార్ ప్లేయర్ల కోసం ప్రత్యేక ప్లాన్స్ రెడీ చేసుకోవాలని సూచించాడు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ నెగ్గడానికి టీమ్స్ అన్నీ తమ ప్లాన్స్ ను రెడీ చేసుకుంటున్నాయి. టీమిండియా సైతం వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం బ్రియన్ లారా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కొన్ని సలహాలు ఇచ్చాడు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాలని, లేకపోతే.. టీమిండియా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని సూచించాడు ఈ విండీస్ దిగ్గజం.

బ్రియన్ లారా మాట్లాడుతూ..”టీమ్ లో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పుడు ప్రత్యేక ప్రణాళికలు రచించుకోవడం మరచిపోతుంటాం. వాళ్లే అంతా చూసుకుంటారని భావిస్తాం. ప్రస్తుతం టీమిండియాది ఇదే పరిస్థితి. టీమ్ లో వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ లాంటి ఎంతటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. వారి కోసం ప్రత్యేక ప్లాన్స్ సిద్ధం చేయడం కోచ్ బాధ్యత. రాహుల్ ద్రవిడ్ సైతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు టీ20 వరల్డ్ కప్ కోసం స్పెషల్ ప్లాన్స్ రెడీ చేయాలి. గొప్ప ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు వారిని ఉపయోగించుకోవడం ముఖ్యం. ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో వారి కోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నది ద్రవిడ్ కు నేనిచ్చే సూచన” అంటూ విండీస్ దిగ్గజం చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ను 3వ నంబర్ లో బ్యాటింగ్ కు దింపాలని సూచించాడు లారా. టీ20 క్రికెట్ లో సూర్య అద్భుతమైన ప్లేయర్ అని కొనియాడాడు. మరి విరాట్, రోహిత్ కోసం మాస్టర్ ప్లాన్స్ రెడీ చేయాలన్న లారా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి