iDreamPost
android-app
ios-app

‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ లో ప్రమాదం! సంజయ్ దత్ కు..

  • Author Soma Sekhar Published - 10:08 PM, Mon - 14 August 23
  • Author Soma Sekhar Published - 10:08 PM, Mon - 14 August 23
‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ లో ప్రమాదం! సంజయ్ దత్ కు..

సాధారణంగా సినిమా షూటింగ్స్ లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఈ ప్రమాదాల కారణంగా ప్రాణాలు కూడా కొల్పోతుంటారు ఫైట్ మాస్టర్స్ అండ్ టెక్నిషియన్స్. తాజాగా టాలీవుడ్ లో మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు పూరి కనెక్ట్స్ బ్యానర్. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సంజయ్ దత్ కు రెండు కుట్లు కూడా పడ్డాయట.

‘డబుల్ ఇస్మార్ట్’ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో రామ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ముంబాయిలో మెుదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం థాయ్ లాండ్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న టైమ్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో బిగ్ బుల్ సంజయ్ దత్ కు గాయం అయినట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడ్డాడట. అతడి తలకు గాయం కాగా.. రెండు కుట్లు కూడా పడ్డాయని, అయినప్పటికీ సంజయ్ దత్ వెంటనే సెట్ కు తిరిగొచ్చి షూటింగ్ ప్రారంభించాడని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా.. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా వస్తుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది డబుల్ ఇస్మార్ట్.

ఇదికూడా చదవండి: ఎట్టకేలకు రియల్ లవర్ ను పరిచయం చేసిన హైపర్ ఆది! ఎవరంటే?

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın albetrabetraMadridbetkatlaMarsbahis GirişCasibom GirişJojobet GirişCasibomMarsbahis Giriş