iDreamPost
android-app
ios-app

నాలుగేళ్ల కిందట పెళ్లి.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..!

నాలుగేళ్ల కిందట పెళ్లి.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..!

శివానికి చంద్రకాంత్ అనే వ్యక్తితో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల సంసారం సాఫీగానే కొనసాగింది. కాగా, భర్త ఓ చోట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో శివాని భర్తతో ఉండలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆ వివాహిత తల్లి వద్దే ఉంటుంది. అయితే సోమవారం ఈ మహిళ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఊహించని నిర్ణయం తీసుకుంది. కూతురు చేసిన పని తల్లి పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని సలాబత్ తండాలో చంద్రకాంత్-శివాని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 4 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఇక్కడే కాపురం పెట్టారు. ఇక కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం కూడా సాఫీగానే సాగింది. ఇదిలా ఉంటే.. కుటుంబ సమస్యల విషయమై శివాని భర్తతో గొడప పడి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శివాని తల్లి వద్దే ఉండేది. అయితే సోమవారం శివాని ఇంట్లో తల్లికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది.

దీంతో ఆమె తల్లి ఖంగారుపడి ఊళ్లో అంతా వెతికింది. కానీ, కూతురి ఆచూకి మాత్రం కనిపించలేదు. ఇక చేసేదేం లేక శివాని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఉన్నట్టుండి శివాని జాడ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet