iDreamPost

ప్రియురాలిపై ప్రేమోన్మాది కిరాతం! ఎంతకు తెగించాడంటే?

ప్రియురాలిపై ప్రేమోన్మాది కిరాతం! ఎంతకు తెగించాడంటే?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ యువతి పేరు సంధ్య. తమిళనాడుకు చెందిన ఈ యువతి గతంలో ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అమ్మాయి స్థానికంగా ఉన్న ఓ ఫ్యాన్సీ స్టోర్ లో పని చేస్తుండేది. ఇదిలా ఉంటే.. గతంలో ఈ యువతి ఓ యువకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి గత కొంత కాలం నుంచి అతడిని దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. కట్ చేస్తే.. ఈ క్రమంలోనే సంధ్య ఫ్యాన్సీ స్టోర్ గోడౌన్ లో శవమై కనిపించింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా తిరుపతి కరసల్ ప్రాంతంలో సంధ్య అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉండేది. అయితే ఈ అమ్మాయి స్థానికంగా ఉండే ఓ ఫ్యాన్సీ స్టోర్ లో పనికి కుదిరింది. అయితే ఈ యువతి ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కొంత కాలం నుంచి సంధ్య ఆమె ప్రియుడిని దూరం పెట్టింది.

ఈ క్రమంలోనే ప్రియుడు నాతో మాట్లాడాలని తరుచు ఆ అమ్మాయి వెంటపడ్డట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సంధ్య ఎప్పటిలాగే సోమవారం కూడా స్టోర్ కు వెళ్లింది. కాగా, మధ్యాహ్నం కొన్ని వస్తువులు తీసుకు రావడానికి ఆ స్టోర్ గోడౌన్ లోకి వెళ్లింది. కానీ, ఆ యువతికి ఎంతకు తిరిగి రాలేదు. ఆ స్టోర్ సిబ్బంది వెంటనే గోడౌన్ లోకి వెళ్లి చూడగా.. సంధ్య రక్తపు మడుగులో పడి శవమై కనిపించింది. ఈ సీన్ చూసి ఆ సిబ్బంది షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆ తర్వాత ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం.. ఈ యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకు ఈ యువతిని హత్య చేసింది ఆమె ప్రియుడేనా? లేకుంటే ఇంకెవరైనా హత్య చేశారా అనేది తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి