iDreamPost

ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్స్ పైకి అప్పుడే! సందీప్ నుండి సూపర్ అప్డేట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపుదిద్దుకోబోతున్న చిత్రం స్పిరిట్. కాగా, టైటిల్ ఎనౌన్స్ మెంట్ మాత్రమే జరిగింది. ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ అవుతుందో తెలియదు. తాజాగా సందీప్ కీలక అప్డేట్ ఇచ్చాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపుదిద్దుకోబోతున్న చిత్రం స్పిరిట్. కాగా, టైటిల్ ఎనౌన్స్ మెంట్ మాత్రమే జరిగింది. ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ అవుతుందో తెలియదు. తాజాగా సందీప్ కీలక అప్డేట్ ఇచ్చాడు.

ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్స్ పైకి అప్పుడే! సందీప్ నుండి సూపర్ అప్డేట్!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ బాట పట్టి.. అక్కడ తెలుగోడి సత్తా చాటిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో మొదలైన ఆయన ప్రయాణం.. కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల వరకు కొనసాగింది. బాలీవుడ్ బాక్సాఫీసుకు అసలైన కలెక్షన్ల రుచి చూపించిన దర్శకుడాయన. కబీర్ సింగ్ ఓ ఎత్తు అయితే.. యానిమల్ ప్రభంజనం. రణబీర్ కపూర్ లాంటి బీ గ్రేడ్ నటుడి స్థామినాను దేశం మొత్తం గుర్తించేలా చేసింది ఈ మూవీ. గత ఏడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ చిత్రం సుమారు రూ. 900 కోట్లను కొల్లగొట్టింది. రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అతడి సినిమాలో యాక్ట్ చేసేందుకు బాలీవుడ్ బడా హీరోలు సైతం క్యూ కడుతున్నారు. యానిమల్ కొనసాగింపు.. యానిమల్ పార్క్ ఎనౌన్స్ చేయగా.. ఇదే సెట్స్ పైకి వెళుతుందని అనుకున్నారంతా..

కానీ, సందీప్ రెడ్డి మాత్రం టాలీవుడ్ టాప్ హీరోతో మూవీ చేసేందుకు ప్రిపేర్ అయ్యాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న సంగతి విదితమే. ఇందులో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పాడు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొడుతుందన్న ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే 60 శాతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని, డిసెంబర్ నుండి షూటింగ్ స్టార్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు సందీప్.

తాజాగా పొట్టేల్ టీజర్ లాంచ్ సమయంలో కూడా స్పిరిట్ ఎప్పుడు స్టార్ అవుతుందో మరోసారి స్పష్టం చేశాడు సందీప్.. ఈ ఇయర్ ఎండింగ్‌లో స్టార్ అవుతుందని చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎప్పటి నుండో ప్రభాస్‌ను పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూడాలనుకుంటున్న అభిమానులకు ఫుల్ బూస్టప్ ఇచ్చింది ఈ న్యూస్. ఇక ఇందులో సందీప్ వర్కింగ్ స్టైల్, యాక్షన్ ఎలిమెంట్స్ పక్కా ఉండటం ఖాయమని ఫిక్స్ అయిపోయారు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్. ప్రభాస్ ప్రస్తుతం కల్కి షూటింగ్ పూర్తి చేశాడు. మేలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోంది. అలాగే రాజా సాబ్ షూటింగ్ కూడా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్పిరిట్ కోసం ప్రిపేర్ కానున్నాడు ప్రభాస్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి