iDreamPost
android-app
ios-app

వీడియో: సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్లలో టపాసులు కాలుస్తూ..!

తమ అభిమాన హీరో సినిమా విడుదల అనగానే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అయితే అది కొన్నిసార్లు అత్యుత్సాహంగా కూడా మారుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే లేనిపోని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి.

తమ అభిమాన హీరో సినిమా విడుదల అనగానే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అయితే అది కొన్నిసార్లు అత్యుత్సాహంగా కూడా మారుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే లేనిపోని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి.

వీడియో: సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్లలో టపాసులు కాలుస్తూ..!

సల్మాన్ ఖాన్– కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ తో నడుస్తోంది. తొలిరోజు మాత్రం 44 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్రం మాత్రం అంతంతమాత్రమంగానే ఉందని టాక్ వైరల్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో సల్మాన్ ఫ్యాన్స్ మరో పిచ్చి పని చేసి తమ హీరోకు చెడ్డ పేరు మూటగట్టి పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ తెగ వైరల్ అవుతోంది. టైగర్ 3 సినిమా సందర్భంగా థియేటర్లోనే టపాసులు కాల్చిన దృశ్యాలు చూసి నెటిజనులు ముక్కున వేలేసుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ సినిమా అంటే దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. కానీ, సినిమా మాత్రం తీవ్ర నిరాశ పరిచినట్లు చెబుతున్నారు. మూవీ సంగతి పక్కన పెడితే సల్మాన్ ఫ్యాన్స్ చేసిన పిచ్చి పని ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు గురవుతోంది. దీపావళి సందర్భంగా టైగర్ 3 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ ఫ్యాన్స్ ఏకంగా థియేటర్లోనే దీపావళి చేశారు. అత్యుత్సాహంతో టపాసులను థియేటర్లోకి తీసుకెళ్లి సల్మాన్ సీన్స్ అప్పుడు కాల్చేశారు. వాళ్లు చేసిన పనికి నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో బాంబులు కాల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు చేసిన పని వల్ల ప్రాణనష్టం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేయద్దంటూ హితవు పలుకుతున్నారు.

సల్మాన్ ఫ్యాన్స్ ఇలా థియేటర్లో టపాసులు కాల్చడం ఇదే మొదటిసారి కాదులెండి. 2021లో కూడా అంతిమ్- ది ఫైనల్ ట్రూత్ సినిమాకి కూడా ఇలాగే హాలులో బాంబులు కాల్చారు. అప్పుడు నేరుగా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేయాల్స వచ్చింది. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. ఇలా చేయడం వల్ల మీ ప్రాణాలకే కాదు.. మిగిలిన వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. థియేటర్ యాజమాన్యం వాళ్లు లోపలికి టపాసులు అనుమతించకండి. సెక్యూరిటీతో కట్టుదిట్టంగా చెక్ చేసిన తర్వాతే పంపండి అంటూ విజ్ఞప్తి కూడా చేశాడు. మళ్లీ తాజాగా ఇలా వాళ్లు టపాసులు కాల్చి సల్మాన్ కు చెడ్డ పేరు తీసుకొచ్చారు. మరి.. ఈ ఘటనపై సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇంక టైగర్ 3 మూవీ విషయానికి వస్తే.. కథ, కథనం రెండూ అనుకున్న స్థాయిలో లేవని చెబుతున్నారు. అయితే థియేటర్లో షారుక్ ఖాన్ క్యామియో, హృతిక్ రోషన్ ఎంట్రీలప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటుందంటున్నారు. అలాగే ఈ సినిమాలోనే వార్ 2కి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. హృతిక్ రోషన్ టైగర్ 3లో ఒక ఫైట్ సీన్ లో కనిపిస్తాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారంటన్నారు. రా చీఫ్ ఒక వ్యక్తి గురించి ఎలివేషన్ ఇస్తాడు. ఆ పాత్రలో తారక్ కనిపించబోతున్నాడు అంటున్నారు. మరి.. థియేటర్లో సల్మాన్ ఫ్యాన్స్ బాంబులు కాల్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş