iDreamPost
android-app
ios-app

కోహ్లీ, రోహిత్ ను అవుట్ చేస్తే.. మేము గెలిచినట్టే: పాక్ మాజీ కెప్టెన్

  • Author Soma Sekhar Published - 05:08 PM, Wed - 30 August 23
  • Author Soma Sekhar Published - 05:08 PM, Wed - 30 August 23
కోహ్లీ, రోహిత్ ను అవుట్ చేస్తే.. మేము గెలిచినట్టే: పాక్ మాజీ కెప్టెన్

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మినీ వరల్డ్ కప్ ప్రారంభం అయ్యింది. ముల్తాన్ వేదికగా బుధవారం(ఆగస్టు 30)న పాకిస్థాన్-నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఇక ఆసియా కప్ ప్రయాణాన్ని టీమిండియా దాయాది దేశంతో ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న కాండీ వేదికగా ఇండియా-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా టీమిండియాను మానసికంగా దెబ్బతీయాలని పాకిస్థాన్ భావిస్తోంది. అందులో భాగంగానే పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మరోసారి టీమిండియాపై విషం చిమ్మాడు.

ఆసియా కప్ లో భాగంగా టీమిండియా-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ క్రికెట్ లో ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 2న కాండీ వేదికగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాను మానసికంగా దెబ్బతీయాని పాకిస్థాన్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. కాగా.. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా ఆటగాళ్లను పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ టార్గెట్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ లో టీమిండియా ఆటగాళ్ల గురించి ఈ విధంగా మాట్లాడాడు.

“టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటుగా యంగ్ ప్లేయర్లు కూడా ఉన్నారు. వారికి ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన అనుభవం లేదు. ఇండియా-పాక్ లాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ ల్లో ఒత్తిడిని తట్టుకోవడం ఈ కుర్రాళ్ల వల్ల కాదు. ఇక విరాట్, రోహిత్ అద్భుతంగా ఆడిన మ్యాచ్ ల్లో చాలా సార్లు ఇండియా గెలిచింది. భారత జట్టు బ్యాటింగ్ పరంగా చాలా వీక్ గా ఉంది” అంటూ కామెంట్ చేశాడు సల్మాన్ భట్.

కాగా.. పాకిస్థాన్ బౌలర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్ తీస్తే చాలు సగం మ్యాచ్ గెలిచినట్లే అని సల్మాన్ భట్ వ్యాఖ్యానించాడు. అయితే పాక్ జట్టులో బాబర్, ఫఖర్, రిజ్వాన్, షాదాబ్, షాహీన్, హరీస్ రౌఫ్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారని భట్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న జట్లలో ఆసియా కప్ ఫేవరెట్ పాకిస్థానే అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మరి సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.