iDreamPost

VIDEO: బ్యాట్స్​మెన్​ను వణికించిన ఇంగ్లండ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లతో..!

  • Author singhj Published - 08:49 PM, Tue - 29 August 23
  • Author singhj Published - 08:49 PM, Tue - 29 August 23
VIDEO: బ్యాట్స్​మెన్​ను వణికించిన ఇంగ్లండ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లతో..!

ఆటలోనైనా ఎవరూ రాత్రికి రాత్రే స్టార్లు అయిపోరు. కొన్నేళ్ల కష్టం, కృషి, పట్టుదల ఉంటేనే ఎవరైనా అత్యున్నత స్థాయికి చేరుకోగలరు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నిలకడగా రాణించే వారికి తిరుగుండదు. ఇది క్రికెట్​లోనూ వర్తిస్తుంది. డొమెస్టిక్ లెవల్లో బాగా ఆడే ప్లేయర్లకు నేషనల్ టీమ్​లో ప్లేస్ లభిస్తుంది. అక్కడ కూడా తమను తాము నిరూపించుకొని, నిలకడగా రాణిస్తే స్టార్లు అయిపోవచ్చు. క్రికెట్​లో ఇప్పుడంటే లీగ్​ల్లో ఆటతీరును బట్టి ప్లేయర్లను సెలెక్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం దేశవాళీ పెర్ఫార్మెన్స్​ను బట్టే ఆటగాళ్లను తీసుకునేవారు.

దేశవాళ్లీలో రాణించిన ఆటగాళ్లలో ఓపిక, పట్టుదల, బాగా ఆడాలనే తపన, కసి ఎక్కువగా కనిపించేది. జాతీయ జట్టుకు బాగా ఆడితే పేరు, ప్రఖ్యాతులతో పాటు మంచి సంపాదన కూడా ఉంటుందని భావించేవారు. కానీ ఇప్పుడు లీగ్​ల వల్ల ధనార్జనకు కొదువ లేకుండా పోయింది. అయితే లీగ్​ల హవా ఇంత ఉన్న సమయంలోనూ కొన్ని దేశాలు దేశవాళీలను పటిష్టంగా మార్చుకుంటున్నాయి. డొమెస్టిక్ లెవల్లో బాగా ఆడిన ప్లేయర్లకు పిలిచి మరీ టీమ్​లో చోటు కల్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్​-2023లో హ్యాంప్​షైర్ జట్టు ఫైనల్​కు చేరుకుంది.

వార్విక్​షైర్​తో గురువారం జరిగిన సెమీస్​లో హ్యాంప్​షైర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో హ్యాంప్​షైర్ బౌలింగ్ ఆల్​రౌండర్ లియామ్ డాసన్ చెలరేగిపోయాడు. అతడు తన స్పిన్ మాయాజాలంతో వార్విక్​షైర్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. డాసన్ స్పిన్ ఉచ్చులో పడి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడింది. అతడు తాను వేసిన మొదటి 10 బంతుల్లో రన్స్ ఏమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా డాసన్ ఈ మ్యాచ్​లో 6.5 ఓవర్లు వేసి 7 వికెట్లు పడగొట్టాడు. వార్విక్​షైర్ నిర్దేశించిన 94 పరుగుల లక్ష్యాన్ని హ్యాంప్​షైర్ టీమ్ 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ ఛేదించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి