iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ‘సలార్’ స్టోరీ లైన్ రివీల్.. ఇక KGF కథ కంచికే!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సలార్‌ సినిమా డిసెంబర్‌ 22న ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. డిసెంబర్‌ 1న ట్రైలర్‌ లాంచ్‌ అవ్వనుంది...

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సలార్‌ సినిమా డిసెంబర్‌ 22న ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. డిసెంబర్‌ 1న ట్రైలర్‌ లాంచ్‌ అవ్వనుంది...

ప్రభాస్ ‘సలార్’ స్టోరీ లైన్ రివీల్.. ఇక KGF కథ కంచికే!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్‌’ సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 22న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ అయిపోయారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ కూడా మ్యూజిక్‌ విషయంలో తలమునకలు అయ్యే బిజీలో పడ్డారు.

సలార్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ రవిపై ఒత్తిడి తెస్తున్నారట. కేజీఎఫ్‌ సినిమాలను మించి సలార్‌ బీజీఎమ్స్‌ ఉండాలని అంటున్నారట. దీంతో రవి ట్యూన్స్‌ చేయటం కోసం రోజులో ఎక్కువ గంటలు పని చేస్తున్నారట. ఇక, సలార్‌ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ తెరపైకి వచ్చింది. సలార్‌ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ చిత్రానికి కేజీఎఫ్‌ సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదట.

ఈ విషయాలను స్వయంగా ప్రశాంత్‌ నీల్‌ ఓ బాలీవుడ్‌ ట్యాబులాయిడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారట. ఇదే గనుక నిజం అయితే, ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకుడికి పండగే అని చెప్పాలి. సలార్‌ మొదటి భాగం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా చాలు రెండో భాగం ఇండస్ట్రీని కుమ్మేస్తుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా కాకపోయినా.. సినిమాలో ఉన్నది ‍ప్రభాస్‌ కాబట్టి.. రిజల్ట్స్‌ ఎలా ఉన్నా కలెక్షన్లకు మాత్రం ఢోకా ఉండదు.

ఇక, సలార్‌ ట్రైలర్‌ను డిసెంబర్‌ 1వ తేదీ సాయంత్రం రిలీజ్‌ చేద్దామని చిత్ర బృందం భావించింది. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు కూడా ప్లాన్‌లు చేసిందట. అయితే, యానిమల్‌ సినిమా అదే రోజు రిలీజ్‌ అవుతున్న కారణంగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నారట. యానిమల్‌ హీట్‌ ముందుర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు అంతగా రెస్పాన్స్‌ రాకపోవచ్చని చిత్ర బృందం భావించిందట. సినిమా విడుదలుకు కొన్ని రోజుల ముందు దేశంలోని ముఖ్య నగరాల్లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు నిర్వహించాలని చూస్తోందట.

యానిమల్‌ హవా కొంచెం తగ్గిన తర్వాత మెల్లగా సినిమా ప్రమోషన్లు చేయాలని చూస్తోందట. ట్రైలర్‌ విడుదలైన తర్వాత మూవీపై అంచనాలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో సలార్‌కు కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేయాల్సిన అవసరం కూడా లేదని చిత్ర బృందం భావిస్తోందట. మరి, సలార్‌ రెండు భాగాలు ఉండనుందని మీడియాలో వస్తున్న కథనాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి