SNP
Sajeevan Sajana, WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. అయితే.. ఈ విజయం అందించిన సజనా జర్నీ మాత్రం కన్నీళ్లు తెప్పించేలా ఉంది. ఆమె క్రికెటింగ్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Sajeevan Sajana, WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. అయితే.. ఈ విజయం అందించిన సజనా జర్నీ మాత్రం కన్నీళ్లు తెప్పించేలా ఉంది. ఆమె క్రికెటింగ్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఉమెన్స్ క్రికెట్‌లో ఒక కొత్త అధ్యాయంగా చెప్పుకునే.. డబ్ల్యూపీఎల్(ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) సీజన్ 2 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా.. బాలీవుడ్ తారాల హోరెత్తించే డ్యాన్స్‌ల నడుమ.. డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‌కు మొదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. భారీ హైప్‌తో స్టార్ట్ అయిన ఈ లీగ్‌కు అదిరిపోయే స్టార్ట్ లభించింది. చివరి బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో.. లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి ముంబై ఇండియన్స్‌ను సజీవన్ సజనా గెలిపించింది. దీంతో ఈ బ్యాటర్ టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయింది. అయితే.. ఆమె స్టోరీ మాత్రం చాలా మందికి స్ఫూర్తి నించేలా ఉంది. ఎన్నో కష్టాలు దాటుకుని.. సజనా ఈ స్థాయికి చేరింది. ఆమె సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం..
సజీవన్ సజనా.. కేరళలోని వాయనాడ్‌లో గల మనంతవాడి అనే మారుమూల ప్రాంతంలో జన్మించింది. 28 ఏళ్ల సజనా కురిచియా అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఒక రిక్షావాలా. కుటుంబం గడవడానికి ఆయన రోజంతా రిక్షా తొక్కుతూ ఆయన చెమట చిందించేవాడు. అయితే.. సజనాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. కూతురు ఇష్టాన్ని గుర్తించిన తండ్రి.. ఆమెను గొప్ప క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని కలలు కన్నాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. ఒక వైపు రిక్షా నడుపుతూనే.. మరోవైపు కూతురి క్రికెట్ కెరీర్ కోసం కూడా కష్టపడేవాడు. సజనా క్రికెట్ అయ్యేందుకు ఆమె తండ్రి పాత్ర చాలా ఉంది. అంచెలంచెలుగా ఎదిగిన సజనా దేశవాళ్లి క్రికెట్‌లో లేడీ ధోనిగా పేరుతెచ్చుకుంది. ఎప్పటికైనా ధోనిని మించిన మ్యాచ్ ఫినిషర్ అవుతుందంటూ.. ఆమె తోటి క్రికెటర్లు, కోచ్‌లు భావించేవాళ్లు. అయితే.. క్రికెట్‌లో వడివడిగా అడుగులేస్తున్న తరుణంలో సజనా.. కేరళ వరదల్లో తన సర్వం కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకుని తిరిగి తన సత్తా చాటుతోంది.
ఇక దేశవాళి క్రికెట్‌లో సజనా కేరళ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. అదే విధంగా సౌత్‌జోన్, ఇండియా-ఏ జట్ట తరఫున కూడా ఆడింది. దేశవాళి క్రికెట్‌లో అదరగొడుతున్నా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభ సీజన్ వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచేజ్ కూడా ఆసక్తి చూపించలేదు. ఈ విషయం సజనాను చాలా బాధ పెట్టింది. అదే సమయంలో ఆమెలో కసిని కూడా పెంచింది. తన ఆటపై మరింత ఫోకస్ చేసి.. ఎలాగైనా డబ్ల్యూపీఎల్‌లో సత్తా చాటాలని కఠోర శ్రమ చేసింది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో సజనాను రూ.15 లక్షలకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది.
తనకు వచ్చిన అవకాశాన్ని తొలి మ్యాచ్, తొలి బంతితోనే అద్భుతంగా వినియోగించుకుని సంచలనం సృష్టించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయానికి చివరి రెండు బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో 20వ ఓవర్ 5వ బంతికి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అద్భుతంగా ఆడుతున్న ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. ఇక ఒక్క బాల్‌కు 5 రన్స్ కావాలి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన సజనా.. ఎవరూ ఊహించని విధంగా భారీ సిక్స్‌తో ముంబైకి థ్రిల్లింగ్ విక్టెరీ అందించింది. ఈ ఇన్నింగ్స్‌తోనే సజనా పేరు మారుమోగిపోతుంది. మరి సజనా బ్యాటింగ్‌తో పాటు, ఆమె జర్నీలో వాళ్ల నాన్న కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Naino mein sapna. Sapnon mein Sajana. 🥹🔥
(Admit it, you sang it!) #OneFamily #AaliRe #MumbaiIndians #TATAWPL #MIvDC
— Mumbai Indians (@mipaltan) February 23, 2024
Sajeevan Sajana. On debut. Facing her first ball. Hitting a last-ball six.
What a WPL opener 🔥 https://t.co/XHAuU7lrh2 | #WPL2024 pic.twitter.com/9P3t3ObxWW
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2024