iDreamPost

‘సుందరం మాస్టర్‌’ఈవెంట్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘సుందరం మాస్టర్‌’ఈవెంట్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘సుందరం మాస్టర్‌’ సినిమా టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ, ఫ్యాన్స్‌ను ఉద్ధేశిస్తూ ఓ అద్భుతమైన డైలాగ్‌ చెప్పారు. ఆ డైలాగ్‌తో ఈవెంట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోయారు. చప్పట్లు, కేకలతో హాలును అ‍ల్లాడించారు. ఇంతకీ సాయి ధరమ్‌ తేజ్‌ ఆ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘‘ నేను టీజర్‌ లాంఛ్‌ చేయటానికి ఐదు కారణాలు ఉన్నాయి. మొదటి మూడు కారణాలు ఏంటంటే.. శ్రీకేశ్వరరావు గారు, రమ గారు, అక్షర.. వాళ్ల కారణంగానే నాకు ఈ అవకాశం వచ్చింది.

ఆల్‌ దిబెస్ట్‌.. మీ అబ్బాయి చాలా బాగా యాక్ట్‌ చేస్తాడు.. బాగా గ్రో అవుతాడు. నాలుగో రీజన్‌.. నాకు బాగా ఇష్టమైన హీరో రవితేజ గారు. ఆయన నాకు నేర్పించిన చిన్న చిన్న విలువల కోసం నేను వచ్చాను. విషింగ్‌ రవితేజ గారు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ఐదో కారణం.. ప్రధాన కారణం ఏంటంటే.. మీ ప్రేమను పొందడానికి.. అమ్మాయి ప్రేమలో కిక్కు లేదు.. మీ ప్రేమలో కిక్కు ఉంది. మీ ప్రేమ పొందడంలో కిక్కు ఉంది. మీ ప్రేమలో మీ బ్లెస్సింగ్స్‌ కూడా ఉంటాయి కాబట్టి చాలా చాలా థాంక్స్‌’’ అని అన్నారు.

కాగా, సుందరం మాస్టర్‌ టీజర్‌కు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ సినిమాకు మాస్‌ మహారాజా రవితేజ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వైవా హర్ష లీడ్‌ రోల్‌ చేశారు. మరి, ‘సుందరం మాస్టర్‌’ సినిమా టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి