Nidhan
సచిన్ టెండూల్కర్.. క్రికెట్లో బ్యాటింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరిది. జెంటిల్మన్ గేమ్‌లో లెక్కకు మించి రికార్డులను తన పేరు మీద రాసుకున్న ఈ లెజెండరీ క్రికెటర్ జర్నీ మొదలైంది ఈ రోజే.
సచిన్ టెండూల్కర్.. క్రికెట్లో బ్యాటింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరిది. జెంటిల్మన్ గేమ్‌లో లెక్కకు మించి రికార్డులను తన పేరు మీద రాసుకున్న ఈ లెజెండరీ క్రికెటర్ జర్నీ మొదలైంది ఈ రోజే.
Nidhan
ఇప్పుడు క్రికెట్ బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారిపోయింది. ఫ్లాట్ పిచ్‌లు తయారు చేస్తుండటంతో బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తున్నారు. బ్యాట్‌లోని స్వీట్ స్పాట్‌కు టచ్ అయితే చాలు బాల్ బౌండరీకి దూసుకెళ్లాల్సిందే. ఐదారుగురు తప్పితే పెద్దగా భయపెట్టే బౌలర్లు కూడా కనిపించడం లేదు. కానీ అది 90వ దశకం. భీకరమైన ఫాస్ట్ బౌలర్లు, బాల్‌ను గింగిరాలు తిప్పే స్పిన్నర్లతోపాటు కఠినమైన పిచ్‌లు కూడా బ్యాట్స్‌మెన్‌ను పరీక్ష పెట్టేవి. అప్పట్లో పరుగులు చేయాలంటే ఓపిగ్గా క్రీజులో నిలబడాలి. టెక్నిక్‌తో పాటు ధైర్యాన్ని కూడగట్టుకొని ఆడితే రన్స్ వచ్చేవి. అలాంటి టైమ్‌లోనే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి బుల్లెట్లా దూసుకొచ్చాడో ప్లేయర్. ముఖంలో ఇంకా పసిఛాయలు, ఎత్తు ఐదున్నర అడుగుల్లోపే.. వయసు 16 ఏళ్లు మాత్రమే. కానీ అతడిలోని టాలెంట్‌ను గుర్తించి సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అతడే లెజెండ్ సచిన్ టెండూల్కర్. 1989, నవంబర్ 15న ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడతను.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కరాచీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు సచిన్. అదే ఏడాది డిసెంబర్ 18న పాక్ మీదే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు మాస్టర్ బ్లాస్టర్. సరిగ్గా 34 ఏళ్ల కింద ఇదే రోజు దాయాదిపై మ్యాచ్‌తో లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో తన జర్నీని మొదలుపెట్టాడు. అయితే ప్రత్యర్థి జట్టులోని స్టార్ పేసర్ వకార్ యూనిస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతడి బౌలింగ్‌లో మరో లెజెండరీ స్పీడ్‌స్టర్ వసీం అక్రమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు మాస్టర్. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 7 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫెయిలైనప్పటికీ ఆ తర్వాత కాలంలో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా అవతరించాడు సచిన్. వన్డే కెరీర్ ముగిసేనాటికి 49 సెంచరీలు బాదిన అతడు.. ఏకంగా 18,426 రన్స్ చేశాడు.
కెరీర్ స్టార్టింగ్‌లో కపిల్ దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి గ్రేట్ క్రికెటర్స్‌తో కలసి ఆడటం సచిన్‌కు చాలా పనికొచ్చింది. వయసులో చిన్నవాడైన మాస్టర్ బ్లాస్టర్‌ను ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసేవారు. జట్టులోని సీనియర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ, ప్రతి ఫెయిల్యూర్ నుంచి త్వరగా బయటపడుతూ తనను తాను చాలా స్ట్రాంగ్‌గా మలచుకున్నాడు. అనంతరం ఒక బ్యాటర్‌గానే గాక బౌలర్‌గానూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సచిన్ ఔటైతే ఆడియెన్స్ టీవీలను ఆఫ్ చేసేవారు. టెస్టుల నుంచి టీ20ల వరకు, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ లాంటి లీగ్స్ వరకు ఆడిన ప్రతి ఫార్మాట్ మీద చెరగని సంతకం చేశాడు సచిన్. ఆడిన ఫస్ట్ వన్డే మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ప్లేయర్.. ఆ తర్వాత కాలంలో వరల్డ్ క్రికెట్లో గోల్డెన్ బ్యాటర్‌గా మారతాడని ఎవరూ ఊహించి ఉండరు. కారీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన లిటిల్ మాస్టర్‌కు ఫ్యాన్స్ అందరూ మరోమారు సెల్యూట్ చేస్తున్నారు. మరి.. సచిన్ క్రికెట్ కెరీర్లో మీరు మర్చిపోలేని ఇన్నింగ్స్ ఏదైనా ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sai Sudharsan: సాయి సుదర్శన్.. ఒక్క మ్యాచ్‌తోనే వాళ్లిద్దరిని భయపెడుతున్నాడుగా!
On this day in 1989, Sachin Tendulkar made his ODI debut against Pakistan, getting out for a two-ball duck. He went on to end his career with 18,426 runs, 49 centuries, and one of the greatest cricketers ever in the game. pic.twitter.com/diKpxgXtn5
— CricTracker (@Cricketracker) December 18, 2023