iDreamPost
android-app
ios-app

కోహ్లీ 50 సెంచరీ.. డ్రెస్సింగ్ రూమ్ మెమొరీస్ షేర్ చేస్తూ సచిన్ ఎమోషనల్ పోస్ట్!

వరల్డ్ కప్ 2023 సెమీస్ మ్యాచ్ లో టీమిండియా ప్రదర్శన ఒకెత్తు అయితే విరాట్ కోహ్లీ 50వ శతకం సాధించడం మరింత స్పెషల్ అయిపోయింది. అంతేకాకుండా తన రికార్డు బ్రేక్ చేయడంపై సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ అయ్యాడు.

వరల్డ్ కప్ 2023 సెమీస్ మ్యాచ్ లో టీమిండియా ప్రదర్శన ఒకెత్తు అయితే విరాట్ కోహ్లీ 50వ శతకం సాధించడం మరింత స్పెషల్ అయిపోయింది. అంతేకాకుండా తన రికార్డు బ్రేక్ చేయడంపై సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ అయ్యాడు.

కోహ్లీ 50 సెంచరీ.. డ్రెస్సింగ్ రూమ్ మెమొరీస్ షేర్ చేస్తూ సచిన్ ఎమోషనల్ పోస్ట్!

వరల్డ్ కప్ 2023 సెమీస్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. భారత్ ప్రదర్శన ఒకెత్తు అయితే.. విరాట్ కోహ్లీ హిస్టారిక్ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించాడు. సచిన్ పేరిట ఉన్న 49 శతకాల రికార్డును ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అది కూడా సచిన్ సొంతూరిలో.. సచిన్ సమక్షంలో కింగ్ కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. ఈ రికార్డుపై టీమిండియా అభిమానులు, అనుష్క, మాజీలు ఆనందం వ్యక్తం చేయడం కామన్. కానీ, తన రికార్డు బ్రేక్ చేయడంపై స్వయంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ అయ్యాడు. తన ఆనందాన్ని ఒక ఎమోషనల్ పోస్టు రూపంలో షేర్ చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ కెరీర్ లో ఈ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చిరకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే సచిన్ రికార్డును ఆయన సమక్షంలోనే విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ రికార్డును సమం చేసినప్పుడు ఒక మాట అన్నాడు. “నాకు 49 నుంచి 50 శతకానికి చేరుకోవడానికి ఏడాదికి పైగా పట్టింది. కానీ, కోహ్లీ వీలైనంత త్వరగా ఆ ఫీట్ ని సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. అయితే సచిన్ కోరుకున్న విధంగానే కోహ్లీ ఆ ఘనతను సాధించి చూపించాడు. శతకం పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లీ.. సచిన్ కి పాదాబివందనం చేయడం చూశాం. ఒక క్రికెట్ అభిమానికి అది చాలా ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు తన రికార్డు బ్రేక్ కావడంపై సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ అయ్యాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో విరాట్ కోహ్లీ గురించి ఎమోషనల్ పోస్టు కూడా చేశాడు. నిజానికి తన రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

“నేను నిన్ను మొదటిసారి ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో కలిసినప్పుడు మిగిలిన జట్టు సభ్యులు నిన్ను ప్రాంక్ చేశారు. నువ్వు నా కాళ్లకు నమస్కరించాలని వాళ్లు నీతో చెప్పారు. ఆరోజు నేను ఎంతో నవ్వుకున్నాను. కానీ, తర్వాత క్రికెట్ మీద నీకున్న ప్యాషన్, స్కిల్ తో నా హృదయాన్ని టచ్ చేశావ్. ఆ కుర్రాడు విరాట్ ప్లేయర్ గా ఎదడగం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఇండియన్ రికార్డును బ్రేక్ చేశాడంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? అది కూడా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లాంటి ఒక మ్యాచ్ లో, నా హోమ్ గ్రౌండ్ లో చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది” అంటూ సచిన్ పోస్ట్ చేశాడు. సచిన్ రికార్డును సమయం చేసినప్పుడు శుభాకాంక్షలు చెప్పాడనే విరాట్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అలాంటిది ఇప్పుడు ఇలా రికార్డు బ్రేక్ చేసిన సందర్భంగా మెచ్చుకోవడంపై ఇంకెంత ఉబ్బితబ్బిబ్బు అయిపోయుంటాడో అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ రికార్డు మాత్రమే కాకుండా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇంకో రికార్డు కూడా బ్రేక్ చేశాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ రికార్డుతో తన 50వ శతకం మరింత స్పెషల్ గా మారిపోయింది. మరి.. విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.