Somesekhar
అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించారు. ఇక తాజాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో జూనియర్ సచిన్ అద్భుత శతకంతో చెలరేగాడు. పేరులోనే కాదు.. ఆటలోనూ మాస్టర్ బ్లాస్టర్ ను దింపేశాడు.
అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించారు. ఇక తాజాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో జూనియర్ సచిన్ అద్భుత శతకంతో చెలరేగాడు. పేరులోనే కాదు.. ఆటలోనూ మాస్టర్ బ్లాస్టర్ ను దింపేశాడు.
Somesekhar
సచిన్ టెండుల్కర్.. ప్రపంచ క్రికెట్ కు ఓ దిక్సూచి. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి చాలా కాలం అవుతున్నాగానీ.. ఎక్కడో ఒక చోట అతడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక అతడు నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం అండర్ 19 టీమిండియా జట్టులోనూ ఓ సచిన్ ఉన్నాడు. అతడి పూర్తి పేరు సచిన్ దాస్. తాజాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో అద్బుతమైన శతకంతో చెలరేగాడు ఈ యంగ్ ప్లేయర్. సచిన్ పేరే కాదు.. అచ్చం అలాంటి ఆటతోనే అబ్బురపరిచాడు ఈ యంగ్ సచిన్. కెప్టెన్ ఉదయ్ సహరన్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో.. టీమిండియా భారీ స్కోర్ సాధించింది.
అండర్ 19 వరల్డ్ కప్ లో యువ టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఈ మెగాటోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది టైటిల్ రేసులో ముందంజలో ఉంది. బంగ్లాదేశ్ పై 84 పరుగుల తేడాతో, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ పై 201 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక శుక్రవారం(ఫిబ్రవరి 2)న నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో సైతం విజయం సాధించే దిశగా ఉంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ టీమిండియా బ్యాటింగ్ లో దుమ్మురేపింది. కెప్టెన్ ఉదయ్ సహరన్, మిడిలార్డర్ బ్యాటర్ సచిన్ దాస్ లు అద్భుత శతకాలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగుల స్కోర్ ను సాధించింది. కెప్టెన్ ఉదయ్(100), సచిన్ దాస్(116) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరూ 4 వికెట్ కు 215 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక ఈ మ్యాచ్ లో జూనియర్ సచిన్ బ్యాటింగే హైలెట్ అని చెప్పుకోవాలి. పేరులోనే కాదు.. ఆటలోనూ సచిన్ ను దింపేశాడు ఈ యంగ్ ప్లేయర్. సొగసైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపాడు. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమ్ ను మాస్టర్ బ్లాస్టర్ లాగే ఆదుకుని, భారీ స్కోర్ కు బాటలు వేశాడు. ఎక్కడా తొందరపడకుండా.. ఒత్తిడికి గురికాకుండా, బ్యాటింగ్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ కొట్టినట్లుగానే అచ్చుగుద్దినట్లు ఆడుతూ.. ప్రేక్షకులను అలరించాడు. తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లతో పాటుగా 3 సిక్సులు ఉండటం విశేషం. మరి అండర్ 19 జట్టులో అదరగొట్టిన ఈ సచిన్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
CENTURY!
That’s a brilliant 💯 from Sachin Dhas 👏👏#TeamIndia 256/3 with 4 overs to go.
Follow the match ▶️ https://t.co/6Vp3LnoN6N#INDvNEP | #U19WorldCup pic.twitter.com/bURvLO9IKj
— BCCI (@BCCI) February 2, 2024
ఇదికూడా చదవండి: ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్.. తొలిరోజు మ్యాచ్ లో హైలెట్స్! జైస్వాల్ దండయాత్ర