Nidhan
అందరూ భయపడుతున్న కరీబియన్ పిచ్‌లపై విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు సౌతాఫ్రికా స్టార్ డికాక్. యూఎస్ఏతో జరుగుతున్న సూపర్-8 పోరులో జూలు విదిల్చాడీ వెటరన్ బ్యాటర్.
అందరూ భయపడుతున్న కరీబియన్ పిచ్‌లపై విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు సౌతాఫ్రికా స్టార్ డికాక్. యూఎస్ఏతో జరుగుతున్న సూపర్-8 పోరులో జూలు విదిల్చాడీ వెటరన్ బ్యాటర్.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిసి.. సూపర్-8 మ్యాచ్‌లు మొదలయ్యాయి. దీంతో అందరూ కరీబియన్ పిచ్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి స్లో వికెట్ల మీద హిట్టింగ్ చేయడం కష్టం, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కట్టర్స్, స్లో బౌన్సర్స్‌ను ఫేస్ చేస్తూ పరుగుల వరద పారించడం అసాధ్యమని అంటున్నారు. అయితే ఇదంతా ట్రాష్.. బ్యాటర్‌కు దమ్ముంటే పరుగులు అవే వస్తాయని ప్రూవ్ చేశాడు సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్. అమెరికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు డికాక్. స్లో, స్టడీగా ఆడితే పరుగులు వస్తాయన్న కరీబియన్ పిచ్‌లపై హిట్టింగ్ కూడా ఈజీ అని అతడు ప్రూవ్ చేశాడు.
యూఎస్ఏతో మ్యాచ్‌లో డికాక్ ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్‌కు దిగాడు. 7 బౌండరీలు, 5 భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న ఈ ప్రొటీస్ ఓపెనర్ 74 పరుగులు చేశాడు. అతడికి తోడుగా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 46) కూడా సూపర్బ్ నాక్‌తో అలరించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 20 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో టీమ్‌కు భారీ స్కోరు అందించారు. వీళ్లందరూ రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది మార్క్రమ్ సేన. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డికాక్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అతడు మొదట్నుంచి విరుచుకుపడటంతో అమెరికా బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా అదరగొట్టడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మరి.. డికాక్ ఇన్నింగ్స్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
You need supporting pitches for the minnows to flourish.When pitches get flat they become super flat.
Otherwise fluke like Quinton de Kock will also murder them.
This might be the first and last World Cup where we have seen this many upset.pic.twitter.com/CGigwOsyPz
— Sujeet Suman (@sujeetsuman1991) June 19, 2024