iDreamPost

ఒక్క సినిమాకు 250 కోట్లా ?

ఒక్క సినిమాకు 250 కోట్లా ?

దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ స్థాయిలో ఇంకా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కెజిఎఫ్ 2. కరోనా సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే ఈపాటికి రిలీజై నెల దాటి ఉండేది. ఓటిటి లోనూ దర్శనమిచ్చేది. కానీ ఊహించని విధంగా లాక్ డౌన్ పరిణామాలు పరిశ్రమను అతలాకుతలం చేయడంతో ఆ దెబ్బ కెజిఎఫ్ 2 మీద కూడా పడింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన చాప్టర్ 1 పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడీ సీక్వెల్ మీద అంచనాలు మాములుగా లేవు. బిజినెస్ ఆఫర్లు కూడా మతులు పోయే రేంజ్ లో వచ్చాయి. లేటెస్ట్ అప్ డేట్ మాత్రం పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది.

బెంగుళూరు మీడియా టాక్ ప్రకారం కెజిఎఫ్ 2 డైరెక్ట్ ఓటిటి డీల్ కోసం ఓ పెద్ద సంస్థ ఏకంగా 250 కోట్ల డీల్ ఆఫర్ చేసిందని వినికిడి. ఇది చాల టెంప్ట్ చేసే ప్రతిపాదన. ఎలా చూసుకున్నా లాభసాటే. డబ్బింగ్ హక్కులు, శాటిలైట్ తదితరాల ద్వారా మరో వంద కోట్లు వెనకేసుకోవచ్చు. కానీ హీరో యష్ తో సహా టీమ్ మొత్తం దీనికి సానుకూలంగా స్పందించక పోవడంతో పాటు శాండల్ వుడ్ బ్రాండ్ ఇమేజ్ ని అమాంతం పెంచే ఇలాంటి మూవీస్ ని బిగ్ స్క్రీన్ మీద మాత్రం చూపించాలని అందుకే నిర్మొహమాటంగా నో చెప్పారని టాక్. ఈ లెక్కన ఓటిటిలకు కొత్త సినిమాలు ఏ స్థాయిలో ఆదాయాన్ని తెస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు

కొత్త విడుదల తేదీ కోసం కెజిఎఫ్ 2 మల్లగుల్లాలు పడుతోంది. పుష్ప 1 క్రిస్మస్ ని లాక్ చేసుకోవడంతో దాన్ని ఫేస్ చేయాలా వద్దా అనే ఆలోచనలో తీవ్ర చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ అక్టోబర్ లో ప్లాన్ చేద్దాం అంటే ఆర్ఆర్ఆర్ ఉంది. సంక్రాంతికేమో టాలీవుడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. అందుకే ఎప్పుడు అనుకూలంగా ఉంటుందనేది పెద్ద పజిల్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కెజిఎఫ్ 2 లో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఉండటంతో రేంజ్ పెరిగిపోయింది. రాఖీ భాయ్ బంగారు గనిని తన ఆధీనంలోకి తీసుకున్నాక ఏం జరిగిందనే దాని మీద ఈ సీక్వెల్ ఉంటుంది

Also Read : షేర్షా సినిమా రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి