iDreamPost

తారక్ ఈ స్పీడ్ ఏంటి? నీల్ ప్రాజెక్ట్ ఇంత త్వరగానా?

రావడం కాస్త ఆలస్యం కావచ్చునేమో రావడం పక్కా అంటున్నాడు తారక్. వరుస పెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నాడు యంగ్ టైగర్. దేవర, వార్ 2, ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ. ఇంతకు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కానుందంటే.?

రావడం కాస్త ఆలస్యం కావచ్చునేమో రావడం పక్కా అంటున్నాడు తారక్. వరుస పెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నాడు యంగ్ టైగర్. దేవర, వార్ 2, ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ. ఇంతకు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కానుందంటే.?

తారక్ ఈ స్పీడ్ ఏంటి? నీల్ ప్రాజెక్ట్ ఇంత త్వరగానా?

వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు మ్యాన్ ఆఫ్ ది మాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్‌ను అభిమానులు చూసి రెండేళ్లు అయిపోయింది. తారక్ 30గా తెరకెక్కుతోన్న దేవర అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. ఈ పాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. కానీ వీఎఫ్ఎక్స్, సైఫ్ అలీఖాన్‌కు గాయాలు కావడంతో మూవీ ఆలస్యానికి కారణమైంది. అయితేనేం దసరాకు మూవీ రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది దేవర. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరి కృష్ణ, కళ్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. హిందీ రైట్స్‌ను భారీ ధరకు కరణ్ జోహార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ, ఏఏ ఫిల్మింస్ కొనుగోలు చేశాయి. తమిళ హక్కులను నటుడు, పొలిటీషియన్ ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ దక్కించుకుంది. మలయాళం, కన్నడ రైట్స్ పృధ్వీరాజ్ సుకుమారన్, కిచ్చా క్రియేషన్స్ తీసుకున్నాయి. ఇటు వార్-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమాలపై విపరీతమైన బజ్ నడుస్తుండగానే.. ఇప్పుడు మరో మూవీ షురూ చేశాడు ఎన్టీఆర్. కేజీఎఫ్ సిరీస్, సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి కొత్త మూవీని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టులో నీల్-తారక్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్. సలార్ తర్వాత శౌర్యంగ పర్వం (సలార్ 2) ఉంటుందని అనుకున్నారు కానీ.. ఆ మూవీ కన్నా ఈ సినిమాయే తొలుత సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా, ఎన్టీఆర్ 32వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీ కూడా రెండు పార్టులుగా తీయనున్నారట. ఇది కూడా అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకోనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లోనే పట్టాలెక్కాల్సి ఉండగా.. దేవర చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. వార్ 2 చిత్రీకరణ నిమిత్తం ఇప్పటికే ముంబయిలో ల్యాండ్ అయ్యాడు ఈ టాలీవుడ్ ల్యాండ్ మైన్. ఇక దేవర మూవీ అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో సైఫ్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక హృతిక్ వార్ 2లో నటిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి