iDreamPost

ప్రశాంత్ నీల్ vs షారుఖ్ ఖాన్: ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్

  • Published Feb 26, 2024 | 11:52 AMUpdated Feb 26, 2024 | 11:56 AM

బాక్సాఫీస్‌ వద్ద ప్రశాంత్‌ నీల్‌, షారుఖ్‌ ఖాన్‌ తలపడిన ప్రతిసారి ఆసక్తికర పోరు సాగుతోంది. అయితే మూచ్చటగా మూడో సారి కూడా వీరిద్దరూ పోటీ పడితే ఎలా ఉంటుంది అనే చర్చ సాగుతోంది. ఆ వివరాలు..

బాక్సాఫీస్‌ వద్ద ప్రశాంత్‌ నీల్‌, షారుఖ్‌ ఖాన్‌ తలపడిన ప్రతిసారి ఆసక్తికర పోరు సాగుతోంది. అయితే మూచ్చటగా మూడో సారి కూడా వీరిద్దరూ పోటీ పడితే ఎలా ఉంటుంది అనే చర్చ సాగుతోంది. ఆ వివరాలు..

  • Published Feb 26, 2024 | 11:52 AMUpdated Feb 26, 2024 | 11:56 AM
ప్రశాంత్ నీల్ vs షారుఖ్ ఖాన్: ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్

పఠాన్, జవాన్ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ తో 2023లో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. కరోనా దాడి తరువాత కాస్త ఎక్కువ దెబ్బతిన్న హిందీ సినిమా పరిశ్రమకు షారుఖ్ ఖాన్ తిరిగి ఊపిరి పీల్చుకునేలా చేశారని ట్రేడ్ వర్గాలు కూడా పోగిడాయి. అదే సంవత్సరం మూడో సినిమా డంకీతో షారుఖ్ హ్యాట్రిక్ హిట్ కొడతారని అందరూ ఆశించారు. పైగా ఆ సినిమాకి బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అవడం… ఆయనతో షారుఖ్ ఖాన్ తొలిసారి కలిసి పని చేయటంతో డంకీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ డంకీకి మాత్రం పెద్ద నిరాశే ఎదురైంది. ప్రశాంత్ నీల్ సలార్ తో కాంపిటీషన్ లో రిలీజ్ అవడం వల్ల డంకీ బిజినెస్ బాగా దెబ్బతీసింది.

అయితే ప్రశాంత్ నీల్ షారుఖ్ ఖాన్ సినిమాని దెబ్బ కొట్టటం ఇది రెండోసారి కావడం విశేషం. డంకీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 225 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. సలార్ హిందీ వెర్షన్ లో 150 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినప్పటికీ… డంకీ సినిమా కలెక్షన్లను దెబ్బ కొట్టింది. ఇక ప్రపంచ స్థాయిలో సలార్ 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా… డంకీ 475 కోట్లతో సరిపెట్టుకుంది. పైన చెప్పుకున్నట్టు షారుఖ్ ఖాన్ సినిమాతో పోటీ పడి గెలవడం ప్రశాంత్ నీల్ కు అలవాటే. 2018లో కూడా కేజీఎఫ్ 1 షారుఖ్ జీరో సినిమాతో పోటీ పడింది.

కేజీఎఫ్ హిందిలో 45 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలవగా, జీరో 90 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. జీరో, డంకీ రెండూ డ్రామా జానర్ కు చెందిన సినిమాలు కాబట్టి అవి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత భారీ విజయం సాధించలేక పోయాయని షారుఖ్ అభిమానులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా వాదిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రశాంత్ నీల్ – షారుఖ్ ఖాన్ మాస్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద తలపడితే అప్పుడు అసలైన మజా ఉంటుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి