iDreamPost

బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం..

  • Published May 04, 2024 | 2:17 PMUpdated May 04, 2024 | 2:17 PM

Gold Loan: బంగారం తాకట్టు పెట్టి లోన్‌ తీసుకోవాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని.. ఆలస్యం చేయవద్దని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఎందుకంటే..

Gold Loan: బంగారం తాకట్టు పెట్టి లోన్‌ తీసుకోవాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని.. ఆలస్యం చేయవద్దని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఎందుకంటే..

  • Published May 04, 2024 | 2:17 PMUpdated May 04, 2024 | 2:17 PM
బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం..

బంగారం.. ఈమాటతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. పసిడి అంటే భారతీయులకు ఉన్నంత మోజు.. ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదు. మిగతా దేశాల వారికి బంగారంపై పెద్దగా ఆసక్తి ఉండదు. వారి దృష్టిలో గోల్డ్‌ అంటే కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే. కానీ భారతీయులకు పుత్తడి అంటే స్వయంగా లక్ష్మి దేవి స్వరూపం. అందుకే శుభకార్యాలు, పండుగల వేళ కచ్చితంగా ఎంతో కొంత బంగారం కొంటారు. ఇక గోల్డ్‌ లేకుండా భారతీయుల పెళ్లిళ్లు జరగవు. ఎంత పేదవారైనా సరే.. అప్పో సప్పో చేసి కనీసం గ్రాము బంగారమైన బిడ్డ ఒంటి మీద వేస్తారు. ఇక ధనవంతులు అయితే కిలోల లెక్కన కొనుగోలు చేస్తారు. ఇక భారతీయ మహిళలకు బంగారం అంటే ఆభరణం మాత్రమే కాక.. అక్కరకు ఆదుకునే నేస్తం కూడా. చేతిలో చిల్ల గవ్వ లేకపోయినా.. ఒంటి మీద ఎంతో కొంత బంగారం ఉంటే ఆ ధైర్యమే వేరు.

ఇక ప్రపంచంలో ఏ దేశంలో లేనంత బంగార మన దగ్గ ఉంది. పసిడి ధర చుక్కలను తాకుతున్నా సరే మన దగ్గర మాత్రం డిమాండ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. రేటు ఎంత పెరిగినా సరే.. మనోళ్లు పసిడి కొనుగోళ్లు మాత్రం ఆపడం లేదు. ఇక ప్రస్తుతం మన దేశంలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర 65,550 రూపాయలుగా ఉండగా.. 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 71,510 రూపాయలుగా ఉంది. ఇక గత కొంత కాలంగా అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న గోల్డ్‌ రేటు.. ఈ రెండు రోజుల నుంచి దిగి వస్తోంది. ఈ క్రమంలో బంగారం తాకట్టు పెట్టి లోన్‌ తీసుకోవాలనుకునే వారు ఇప్పుడే త్వరపడాలని.. లేదంటే భవిష్యత్తులో భారీగా నష్టపోతారని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం అంటున్నారు.

కారణం ఏంటంటే.. త్వరలోనే బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది. గోల్డ్‌ రేటులో మార్పులు అనేది యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లతో ముడిపడి ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గిపోయి అప్పడు బంగారానికి ఊహించని రీతిలో డిమాండ్ పెరుగుతుంది. దీంతో రేటు భారీగా పెరుగుతుంది. ఆ ప్రకటనతోనే ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

అయితే గత కొన్ని రోజులుగా అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. దానిని తగ్గిచంఏందుకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా పెంచే పరిస్థితుల్ని కల్పిస్తోంది. దీంతో వరుసగా ఆరోసారి కూడా ఫెడ్‌ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బంగారం ధరలు దిగిరానున్నాయి. అప్పుడు మన దేశంలో కూడా పసిడి ధర తగ్గుతుంది.

గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలనుకునేవారు త్వరపడండి..

ఈ​క్రమంలో బంగారం మీద లోన్‌ తీసుకోవాలనుకునే వారు త్వరపడాలని.. ఇదే మంచి సమయం అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఇప్పటికే పసిడి ధర తగ్గుతోంది. ఇక యూఎస్‌ ఫెడ్‌ కనక వడ్డీ రేట్లను పెంచినా.. స్థిరంగా ఉంచినా.. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుత్తడి రేటు పడిపోతుంది. అప్పుడు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది.

ప్రస్తుతం 22 క్యారెట్‌ బంగారం ధర 65 వేలకు పైగానే ఉంది. ఇప్పుడు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే.. గ్రాము మీద గరిష్టంగా 5 వేల రూపాయల వరకు లోన్‌ ఇస్తాయి. ఇక భవిష్యత్తులో గోల్డ్‌ రేటు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు లోన్‌ తీసుకుంటే తక్కువ మొత్తమే వస్తుంది. కనుక గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలనుకునే వారికి ఇదే మంచి సమయం అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి