iDreamPost
android-app
ios-app

సెట్స్ పైకి సలార్-2? 9 నెలలు ముందే ఊచకోత స్టార్ట్!

  • Published Feb 13, 2024 | 5:12 PM Updated Updated Feb 13, 2024 | 5:12 PM

Prabhas Salaar Part 2 Shoot: సలార్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సలార్ పార్ట్ 2కి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

Prabhas Salaar Part 2 Shoot: సలార్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సలార్ పార్ట్ 2కి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

  • Published Feb 13, 2024 | 5:12 PMUpdated Feb 13, 2024 | 5:12 PM
సెట్స్ పైకి సలార్-2? 9 నెలలు ముందే ఊచకోత స్టార్ట్!

పాన్ వరల్డ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ హైలో ఉంటున్నారు. ఎందుకంటే వారికి సలార్ హిట్టు ఇచ్చిన కిక్కు ఆ స్థాయిలో ఉంది. పైగా ప్రభాస్ లైనప్ చూస్తే కూడా రాబోయే చిత్రాలు కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయి అనే విషయం అయితే క్లారిటీ ఉంది. ఇప్పటికే బాక్సాఫీస్ ని ఒక ఊపు ఊపిన ఈ సలారోడు.. నాగ్ అశ్విన్ తో కల్కి 2898 ఏడీ, డైరెక్టర్ మారుతీతో రాజాసాబ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కల్కీ ఈ ఏడాది వస్తే.. రాజాసాబ్ ని వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్ డేట్స్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో క్రేజీ వార్త అయితే వస్తోంది. అది విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగానే సంబరాలు చేసుకుంటారు.

ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాలు అన్నీ లైనప్ లో ఉన్నాయి. కల్కీ 2898 ఏడీ మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో తెలుగు సినిమా స్థాయిని నిలబెడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత వచ్చే ఏడాది మారుతీ డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీ వస్తుంది. ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి కానుకగా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంక ఈ మూవీలు కాకుండా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ చేయాల్సి ఉంది. తన కెరీర్లోనే తొలిసారి ఒక పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతానికి అయితే ప్రభాస్ లైనప్ అయితే ఇదే. వీటి తర్వాత సలార్ 2: శౌర్యాంగ పర్వం సెట్స్ మీదకు రావాల్సి ఉంది.

ఇప్పుడు క్రేజీ వార్త ఏంటి అంటే.. సలార్ 2 సినిమా అనుకున్న దానికంటే ముందే సెట్స్ మీదకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి సలార్ పార్ట్ 1, శౌర్యాంగ పర్వానికి మధ్యలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాండట. అందుకే సలార్ పార్ట్ 2 రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని ముందే చెప్పారు. కానీ, ఇప్పుడు ప్రశాంత్ నీల్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సలార్ 1 మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ క్రేజ్ ని క్యాచ్ చేసుకోవాలి అని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే శౌర్యాంగ పర్వాన్ని 9 నెలల ముందే ముందే సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో ప్రభాస్ ని ఒప్పించినట్లు కూడా చెబుతున్నారు. ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

స్పిరిట్ కంటే ముందే శౌర్యాంగ పర్వం షూటింగ్ లో ప్రబాస్ పాల్గొంటాడని బజ్ నడుస్తోంది. మరోవైపు ఈ నిర్ణయం వల్ల బాలీవుడ్ ఫ్యాన్స్ కి కూడా ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. అదేంటంటే.. ప్రభాస్ తో స్పిరిట్ ఉంటే.. యానిమల్ 2 సినిమాని తర్వాత తీయాలి అని సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. కానీ, ప్రభాస్ స్పిరిట్ 2 మూవీకి సమయం పడితే మాత్రం.. యానిమల్ 2ని సెట్స్ మీదకు తెచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర 2 కూడా కాస్త ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే ఇటు సలార్ పార్ట్2, అటు యానిమల్ పార్ట్ 2 పట్టాలెక్కుతాయి. అయితే వీటికి సంబధించి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనలు లేవు. మరి.. సలార్ పార్ట్ 2 చిత్రాన్ని ముందే తెరకెక్కించడం మంచిది అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş