iDreamPost

బంగారం ధర రూ.3500 తగ్గే ఛాన్స్! USFD నుండి సంచలన ప్రకటన!

  • Published May 04, 2024 | 2:33 PMUpdated May 04, 2024 | 2:33 PM

ఇప్పటికే ఎన్నాడు లేని విధంగా బంగారం ధర ఈ ఏడాది ఇంతలా పెరగడానికి ప్రధానం కారణం ఇటీవలే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై చేసిన ప్రకటన అన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే పసిడి ధరలు భవిష్యత్తులో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అందరూ ఆందోళన పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా పసిడి ప్రియులకు పండగాలాంటి శుభవార్త అందింది

ఇప్పటికే ఎన్నాడు లేని విధంగా బంగారం ధర ఈ ఏడాది ఇంతలా పెరగడానికి ప్రధానం కారణం ఇటీవలే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై చేసిన ప్రకటన అన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే పసిడి ధరలు భవిష్యత్తులో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అందరూ ఆందోళన పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా పసిడి ప్రియులకు పండగాలాంటి శుభవార్త అందింది

  • Published May 04, 2024 | 2:33 PMUpdated May 04, 2024 | 2:33 PM
బంగారం ధర  రూ.3500 తగ్గే ఛాన్స్! USFD నుండి  సంచలన ప్రకటన!

ఈ ఏడాది బంగారం ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మార్చి , ఏప్రిల్ నెలల్లో భారీగా ఈ బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఎందుకంటే.. పసిడి రికార్డులు గరిష్టా స్థాయి వద్ద ఉన్నాయనే చెప్పవచ్చు. అయిన సరే బంగారం అంటే ఇష్టపడనని వారు అంటూ ఎవరూ ఉండరు. ఈక్రమంలోనే వాటి డిమాండ్, ధరతో పాటు.. కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుంది. అయితే ఎన్నాడు లేని విధంగా బంగారం ధర ఇంతలా పెరగడానికి ప్రధానం కారణం ఇటీవలే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై చేసిన ప్రకటన అన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే పసిడి ధరలు భవిష్యత్తులో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అందరూ ఆందోళన పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా పసిడి ప్రియులకు పండగాలాంటి శుభవార్త అందింది ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై చేసిన ప్రకటనతో.. బంగారం రేట్లు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో తాజాగా పసిడి ప్రియులకు పండగాలాంటి శుభవార్త అందింది. అదేమిటంటే.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశం జరిగినప్పుడు..  ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచి, రానున్న రోజుల్లో అంటే ఏడాదిలో కనీసం 3 సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే.. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే, డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గిపోయి అప్పడు బంగారానికి ఊహించని రీతిలో డిమాండ్ వస్తుంది. దీంతో రేటు భారీగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 30న మళ్లీ యూఎస్ ఫెడ్ సమావేశమైంది. ఇక మే 1వ తేదీన వడ్డీ రేట్లపై ప్రకటన చేశారు.  కాగా, ఆ ప్రకటనలో వడ్డీ రేట్లు తగ్గిస్తాని ప్రకటించినప్పటికీ దానిని ఉపసంహరించుకనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుండటమే ప్రధాన కారణం.

అలాగే అంచనాకు మించి ద్రవ్యోల్బణం నమోదవుతున్న తరుణంలో.. దానిని తగ్గించేందుకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉండచడమో, పెంచే  పరిస్థితులు కల్పిస్తోంది. దీంతో వరుసగా ఆరోసారి కూడా వడ్డీ రేట్లను ఫెడ్ యథాతథంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే బంగారం ధరలు మరింత తగ్గనున్నాయి. ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. గతంలో దాదాపు సున్నా ఉన్న వడ్డీ రేటును ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలోనే ఫెడ్ ఏకంగా 5.25 శాతం నుంచి 5.50 శాతం లెవెల్స్‌కు చేర్చింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచేందుకు గతంలో 4 శాతంగా ఉన్న రెపో రేటును పలు దశల్లో మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ సగం బంగారం ధర తగ్గిపోయిందని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించదని సంకేతాలు వస్తున్న తరుణంలో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయింది. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2330 డాలర్ల లెవెల్స్‌లో ఉండగా.. ప్రస్తుతం అది 2287 డాలర్ లెవెల్స్‌కు పడిపోయింది. ఈ మధ్య ఇంతటి స్థాయిలో పడిపోయింది లేదు. కాగా, మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో (MCX) బంగారం ధరలు 2024 జూన్ లో ఎక్స్‌పైరీ విలువ 10 గ్రాములకు రూ. 70,466 కు చేరింది. ఇక 2024 ఏప్రిల్ 12న రూ. 73,958 వద్ద లైఫ్ టైమ్ హై వాల్యూ నమోదు చేయగా.. అక్కడితో పోలిస్తే ఇది రూ. 3500 తక్కువ కావడం విశేషం. అలాగే దేశీయ మార్కెట్లోనూ ఇవాళ చూసినట్లయితే బంగారం రేటు 22 క్యారెట్లపై రూ. 1000 తగ్గి 10 గ్రాములకు రూ. 65,550 వద్దకు చేరింది. ఇదే 24 క్యారెట్స్ బంగారం రేటు రూ. 1090 దిగొచ్చి తులానికి ప్రస్తుతం రూ. 71,510 వద్ద కొనసాగుతోంది. ఫెడ్ ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఇది ఇంకా పతనం కానుందని నిపుణులు చెబుతున్నారు నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి