iDreamPost

runway 34 review రన్ వే 34 రిపోర్ట్

runway 34 review రన్ వే 34 రిపోర్ట్

సౌత్ డబ్బింగ్ సినిమాల డామినేషన్ తో కకావికలం అయిపోతున్న బాలీవుడ్ నుంచి నిన్న రెండు సినిమాలు రిలీజైతే అందులో హీరోపంటి 2ని జనం నిర్మొహమాటంగా తిరస్కరించారు. కొంతలో కొంత బెటర్ అనే అభిప్రాయం అజయ్డ్ దేవగన్ రన్ వే 34(runway 34 )మీద కలిగింది. క్లాస్ టచ్ కలిగిన ఫ్లైట్ థ్రిలర్ కావడంతో నిన్న భారీ ఓపెనింగ్స్ దక్కలేదు కానీ మీడియా మంచి సపోర్ట్ ఇచ్చింది. ప్రీమియర్ షోల నుంచి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. తనే స్వయానా దర్శకుడు కం నిర్మాత కావడంతో అజయ్ దేవగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు. మరి హిందీ మార్కెట్ లో ఏర్పడ్డ వ్యాక్యూమ్ ని వాడుకునేలా ఈ రన్ వే 34 ఉందా లేదా రిపోర్ట్ లో చూద్దాం

కెప్టెన్ విక్రాంత్ ఖన్నా(అజయ్ దేవగన్-Ajay Devgn)ఎయిర్ లైన్స్ పైలట్. దుబాయ్ నుంచి కోచికి వెళ్తున్న క్రమంలో ఇతని విమానానికి అనుకోని చిక్కులు ఏర్పడతాయి. గమ్యం దగ్గరయ్యే కొద్దీ సమస్య జటిలం అవుతుంది. దీంతో బెంగళూర్ కు డైవర్ట్ చేయాల్సిన ఫ్లైట్ ని ఎంతగా వారించినా త్రివేండ్రం వైపు తిప్పుతాడు. సరిగ్గా అదే సమయంలో పెట్రోల్ అయిపోవడం మొదలవుతుంది. తన మీద నమ్మకం పెట్టుకున్న 150 ప్రాణాలను ఎలా కాపాడాడు అనేదే అసలు కథ. విక్రాంత్ కో పైలట్ తాన్యా(రకుల్ ప్రీత్ సింగ్-rakulpreet) ఇందులో ఎలాంటి సహకారం అందించిందనేది తెరమీద చూడాలి. ఇది 2015లో జరిగిన నిజ ఘటన ఆధారంగా రూపొందించారు.

అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వం వహించి నటించిన రన్ వే 34 ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. సన్నివేశాలను స్క్రీన్ ప్లేని సమకూర్చుకున్న తీరు ఆకట్టుకుంది. అయితే సెకండ్ హాఫ్ లోనూ అంతే టెంపో ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. కోర్ట్ రూమ్ డ్రామాతో పాటు అసలైన మ్యాటర్ మొత్తం తొలి సగంలోనే అయిపోవడంతో క్రమంగా ఆసక్తి తగ్గిపోతుంది. అయితే కాన్సెప్ట్ కి కనెక్ట్ అయినవాళ్లు మాత్రం మరీ ఎక్కువ బోర్ గా ఫీలవ్వరు. అమితాబ్ బచ్చన్ పాత్ర ఎప్పటిలాగే హుందాగా సాగింది. అసీం బజాజ్ ఛాయాగ్రహణం, అమర్ మొహిలే సంగీతం బాగున్నాయి. హీరోపంటి 2 కంటే పదుల రెట్లు ఈ రన్ వే 34 బెటర్ గా ఉందని చెప్పొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి