iDreamPost

రూ. 2 వేల నోట్లపై బిగ్ అలర్ట్.. ఇంకా ఐదు రోజులే గడువు

రూ. 2 వేల నోట్లపై బిగ్ అలర్ట్.. ఇంకా ఐదు రోజులే గడువు

నల్లధనాన్ని రూపు మాపడంలో భాగంగా కేంద్రప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోటును చలామణిలోకి తీసుకొచ్చారు. దాదాపు గత ఆరున్నర సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కాగా ఆ కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు దేశ ప్రజలకు సుమారు 4 నెలల సమయం ఇచ్చింది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ విధించిన గడువు ఇంకో ఐదు రోజుల్లో ముగియనుంది.

కాగా రూ. 2 వేల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సెప్టెంబర్ 30 2023 వరకు రూ. 2 వేల నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపంది. ఆ గడువులోగా నోట్లను మార్పిడి చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన గడువు ఇంకో ఐదు రోజుల్లో ముగియనుండడంతో రూ. 2 వేల నోట్లు కలిగిన వారిని ఆర్బీఐ అలర్ట్ చేస్తోంది. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న నోట్లను గడువులోగా సమీప బ్యాంకుల వద్దకు వెళ్లి మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో రూ. 2 వేల నోట్లు చిత్తు కాగితాల్లాగా చెత్త బుట్టలో వేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

కాగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో గరిష్టంగా 20 వేల వరకు రూ. 2 వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. అయితే ఇంకా నోట్ల మార్పిడికి 5 రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే 25, 26, 27 తేదీల్లో నోట్లు మార్పిడి చేసుకునేందుకు వీలుంది. 28న మిలాద్‌-ఉన్‌-నబి కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 29, 30 తేదీల్లో బ్యాంకులు యధావిదిగా పని చేస్తాయి. ఈ తేదీల్లో రూ.2వేల నోట్లు కలిగిన వారు మార్పిడి చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి