Nidhan
యూఎస్ఏ-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టును కెప్టెన్‌గా ముందుండి లీడ్ చేయనున్నాడు రోహిత్ శర్మ. అయితే అతడిపై ఓ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్‌కు పొట్టి కప్పులో ఆడే అర్హత లేదన్నాడు.
యూఎస్ఏ-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టును కెప్టెన్‌గా ముందుండి లీడ్ చేయనున్నాడు రోహిత్ శర్మ. అయితే అతడిపై ఓ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్‌కు పొట్టి కప్పులో ఆడే అర్హత లేదన్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో ఆడే భారత జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ టీమ్‌కు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. అయితే 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు మీద పలు విమర్శలు వస్తున్నాయి. పించ్ హిట్టర్ రింకూ సింగ్‌ను తీసుకోకపోవడం మీద సోషల్ మీడియాలో బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. గత కొంత కాలంగా భారత టీ20 జట్టు విజయాల్లో రింకూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. చివర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌లు ఫినిష్ చేస్తూ ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటోడ్ని వరల్డ్ కప్ మెయిన్ టీమ్‌లోకి కాకుండా రిజర్వ్డ్ ప్లేయర్‌గా తీసుకున్నారు. ఈ విషయంపై ఓ భారత మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.
రింకూ సింగ్‌కు వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడం మీద టీమిండియా మాజీ బ్యాటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు స్పందించాడు. రింకూను టీమ్‌లోకి తీసుకోకపోవడం దారుణమన్నాడు. ఐపీఎల్-2024లో సరిగ్గా రాణించలేదనే సాకు చూపి మెయిన్ టీమ్‌కు దూరంగా ఉంచడం సహించలేని విషయమంటూ సీరియస్ అయ్యాడు. ఐపీఎల్ ఫామ్ ప్రాతిపదికన రింకూను తీసుకోకపోతే రోహిత్ శర్మ విషయంలోనూ అలాగే వ్యవహరించాల్సిందని చెప్పాడు. 2016 నుంచి ఐపీఎల్లో హిట్‌మ్యాన్ పెర్ఫార్మెన్స్ పూర్తిగా పడిపోయిందన్నాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో కూడా అతడి ఆటతీరు బాగోలేదన్నాడు. కెప్టెన్ కాకపోతే మాత్రం టీమ్‌లో మొదటి వేటు అతడి మీదే పడేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు సిద్ధు.
టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉండే అర్హత రోహిత్‌కు లేదన్నాడు సిద్ధు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌తో పాటు టీమిండియా తరఫున ఆడే టీ20 మ్యాచుల్లోనూ అతడి ప్రదర్శన ఏమాత్రం బాగోలేదన్నాడు. ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే భారత జట్టులో నుంచి ముందు అతడ్నే తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ల్లో టీమిండియాకు వరుస విజయాలు అందించిన రింకూ సింగ్‌ను పక్కనబెట్టడం దారుణమని.. అతడికి న్యాయం జరగాలని సిద్ధు స్పష్టం చేశాడు. అయితే సిద్ధు వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అతడు చెప్పింది కరెక్ట్ అంటుంటే మరికొందరు మాత్రం హిట్‌మ్యాన్ టీ20ల్లోనూ బాగా ఆడగలడని.. ఈ విమర్శలకు వరల్డ్ కప్‌లో సమాధానం చెబుతాడని అంటున్నారు. మరి.. రోహిత్‌కు టీమ్‌లో ఉండటానికి అర్హత లేదంటూ సిద్ధు చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Navjot Singh Sidhu – If Rinku Singh was dropped becoz of IPL form then sorry to say Rohit Sharma hasn’t done anything special in IPL since 2016 & we all know Rohit’s performance in WT20s. This is unfair, Rinku Singh deserve justice#MIvsKKR #RinkuSingh pic.twitter.com/feDHMPXjtH
— Richard Kettleborough (@RichKettle07) May 3, 2024