iDreamPost
android-app
ios-app

RCBలోకి రోహిత్‌ శర్మ.. కెప్టెన్సీ పగ్గాలు కూడా అతనికే!

  • Published Mar 30, 2024 | 4:05 PM Updated Updated Mar 30, 2024 | 4:05 PM

Rohit Sharma, RCB, IPL 2024: ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను వీడి.. ఆర్సీబీ టీమ్‌లోకి వచ్చేస్తున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Rohit Sharma, RCB, IPL 2024: ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను వీడి.. ఆర్సీబీ టీమ్‌లోకి వచ్చేస్తున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Mar 30, 2024 | 4:05 PMUpdated Mar 30, 2024 | 4:05 PM
RCBలోకి రోహిత్‌ శర్మ.. కెప్టెన్సీ పగ్గాలు కూడా అతనికే!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులోకి రోహిత్‌ శర్మ వచ్చేస్తున్నాడనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ క్రేజ్‌తో బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఆర్సీబీకి రోహిత్‌ శర్మ కూడా తోడైతే.. అది ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే.. అతను కేవలం ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, అతని ప్లేస్‌లో హార్ధిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఆ విషయంపై రోహిత్‌ శర్మ చాలా అసంతృప్తిగా ఉన్నాడనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మ.. ఆర్సీబీలోకి వస్తున్నాడంటూ.. ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. వాటిని క్రికెట్‌ అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకు కారణం ఏంటంటే..

ఐపీఎల్‌ 2025 సీజన్‌కి ముందు.. మెగా వేలం జరగనుంది. ఆ వేలానికి ముందు ప్రతి టీమ్‌ తమ కోర్‌ టీమ్‌ను మార్చుకునే ఛాన్స్‌ ఉంటుంది. ఐపీఎల్‌లో భారీ క్రేజ్‌ ఉన్న టీమ్‌గా పేరున్న ఆర్సీబీకి ఒక్క​ కప్పు కూడా లేదు. ఈ సారి కూడా ఆ కప్పు వచ్చేలా కనిపించడం లేదు. అందుకే.. వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం.. వేలంలో మంచి టీమ్‌ను కొనుగోలు చేయాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఒక్క విరాట్‌ కోహ్లీని టీమ్‌లో ఉంచుకుని.. మిగిలిన అందరిని ఇంటికి పంపించే ప్లాన్‌లో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఫామ్‌లో లేకపోవడం, ఐపీఎల్‌ రిటైర్మెంట్‌కు దగ్గర అవుతుండటంతో అతనిపై కూడా ఆర్సీబీ ఆశలు వదులుకుంది.

rohit sharma in rcb

ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌లో తనకు జరుగుతున్న అవమానాలను భరించలేని రోహిత్‌ శర్మ.. ఆ టీమ్‌ను బయటికి వచ్చే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది సీజన్‌లో ఆడటం లేదని కూడా రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ 2024 సీజన్‌ కంటే ముందు పోస్టు చేశాడు. కానీ, మళ్లీ ఏమైందో ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసి.. ముంబై తరఫున ఆడుతున్నాడు. కానీ, వచ్చే సీజన్‌లో మాత్రం అతను ముంబైలో ఉండడని అంతా ఫిక్స్‌ అయిపోయారు. దీంతో.. రోహిత్‌ శర్మను తమ టీమ్‌కు కెప్టెన్‌గా తీసుకురావాలని ఆర్సీబీ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియాలో రోహిత్‌ కెప్టెన్సీలో కోహ్లీ ఆడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్సీబీలో కూడా ఇద్దరు కలిసి ఆడే ఛాన్స్‌ ఉంది. అదే జరిగితే.. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఒకే టీమ్‌కు ఆడితే క్రికెట్‌ అభిమానులకు పండగే. చాలా మంది కేవలం కోహ్లీ, రోహిత్‌ శర్మ కోసం మాత్రమే మ్యాచ్‌ చూసే వాళ్లు ఉన్నారు. ఇక వారిద్దరు ఒకే టీమ్‌ తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగే విధ్వంసమే. మరి రోహిత్‌ శర్మ ఆర్సీబీలోకి కెప్టెన్‌ వస్తాడనే ఊహాగానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.