iDreamPost
android-app
ios-app

Rohit Sharma: గుండెలు పగిలే వీడియో.. రోహిత్ ను ఇంత బాధగా ఎప్పుడూ చూసుండరు!

  • Published Apr 15, 2024 | 1:36 PM Updated Updated Apr 15, 2024 | 6:11 PM

రోహిత్ స్లోగా ఆడాడని, అందువల్లే ముంబై ఓడిపోయిందని స్వార్థపరుడు అంటూ హిట్ మ్యాన్ ను విమర్శిస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ గుండెలు పగిలే వీడియో ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

రోహిత్ స్లోగా ఆడాడని, అందువల్లే ముంబై ఓడిపోయిందని స్వార్థపరుడు అంటూ హిట్ మ్యాన్ ను విమర్శిస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ గుండెలు పగిలే వీడియో ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

Rohit Sharma: గుండెలు పగిలే వీడియో.. రోహిత్ ను ఇంత బాధగా ఎప్పుడూ చూసుండరు!

‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’ అన్నట్లుగా తయ్యారు అయ్యింది టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి. చెన్నైతో తాజాగా జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు హిట్ మ్యాన్. చివరి వరకు క్రీజ్ లో ఉండి కూడా తన టీమ్ కు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. దీంతొ సెంచరీ కోసమే రోహిత్ స్లోగా ఆడాడని, అందువల్లే ముంబై ఓడిపోయిందని స్వార్థపరుడు అంటూ హిట్ మ్యాన్ ను విమర్శిస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ గుండెలు పగిలే వీడియో ఒకటి బయటకి వచ్చింది. రోహిత్ ను ఇంత బాధగా ఎప్పుడూ చూసుండరు.

ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన శతకంతో దుమ్మురేపాడు రోహిత్ శర్మ. అయినప్పటికీ.. అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. సెంచరీ చేసుకోవడం కోసం స్లో గా బ్యాటింగ్ చేయడంతో.. ముంబై ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రోహిత్ అలాంటి వాడు కాదని, అతడి చరిత్ర చూస్తేనే తెలుస్తుందని మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే మ్యాచ్ ఓడిపోవడంతో.. ఎంతో బాధగా గ్రౌండ్ నుంచి డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు రోహిత్. కనీసం ఇతర ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా చేయలేదు.

సహచరులంతా ఒకవైపు ఉంటే.. వారికి దూరంగా పోరాటం చేసి ఓడిపోయిన యోధుడిగా వెళ్లిపోయాడు. తలను కిందికేసి, ఎంతో బాధతో అడుగులు వేస్తూ హిట్ మ్యాన్ అలా వెళ్తుండడాన్ని చూసిన ఫ్యాన్స్ గుండెలు పగిలిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన అభిమానులు ఇలా తమ ఆరాధ్య క్రికెటర్ ను జీవితంలో ఇంత వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయం సాధించలేకపోయినా.. నీ పోరాటానికి హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.