iDreamPost

Virat Kohli: వీడియో: మ్యాచ్ ఓడినా.. హృదయాలు గెలిచిన కోహ్లీ! ఇందుకే నువ్వంటే ఫ్యాన్స్ కు పిచ్చి..

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Virat Kohli: వీడియో: మ్యాచ్ ఓడినా.. హృదయాలు గెలిచిన కోహ్లీ! ఇందుకే నువ్వంటే ఫ్యాన్స్ కు పిచ్చి..

విరాట్ కోహ్లీ.. ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపే ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేవలం 3 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయినా.. హృదయాలు గెలిచాడు కింగ్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. ఇందుకే నువ్వంటే అభిమానులకు పిచ్చి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా ముంబై-ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుచేసింది ముంబై. తొలుత బెంగళూరు ప్లేయర్లు చెలరేగితే.. ఆ తర్వాత ముంబై ఆటగాళ్లు దుమ్మురేపారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయినప్పటికీ.. కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం అభిమానుల హృదయాలను గెలిచాడు. కేవలం ఆర్సీబీ ఫ్యాన్స్, విరాట్ ఫ్యాన్సే కాకుండా.. ముంబై అభిమానుల మనసులు గెలిచాడు కింగ్ కోహ్లీ. ఏం జరిగిందంటే?

Kohli won hearts

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు వచ్చాడు. ఇదే టైమ్ లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ప్రేక్షకులను ఎంకరేజ్ చేయండి అంటూ చేతులతో చూపించాడు. పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు అతడ్ని ఉత్సాహపరచండని విరాట్ చెప్పడంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇది కదా అసలైన స్పోర్ట్స్ మెన్ షిప్ అని కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకే నువ్వంటే మాకు పిచ్చి అంటూ ఫ్యాన్స్ కితాబిస్తున్నారు.

మ్యాచ్ ఓడిపోతున్నాం అని తెలిస్తే చాలా మంది ప్లేయర్లకు కోపం వస్తుంది. కానీ విరాట్ మాత్రం అలా కాదు.. జయాపజయాలతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తిని చాటుతుంటాడు. ఈ విషయం గతంలో కూడా చాలా సార్లు నిరూపితమైంది. ఇక మ్యాచ్ తర్వాత విరాట్-పాండ్యాలు కౌగిలించుకున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది ముంబై. ఇషాన్ కిషన్(69), రోహిత్(38), సూర్యకుమార్(52) పరుగులతో రాణించారు. మరి క్రీడాస్ఫూర్తిని ఘనంగా చాటుకున్న కింగ్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Abhishek (@abhishek_editz7)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి