iDreamPost
android-app
ios-app

Rohit Sharma: నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అదొక్కటే కారణం: రోహిత్ శర్మ

  • Published May 15, 2024 | 4:12 PM Updated Updated May 15, 2024 | 4:12 PM

సాధారణ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి చేరాడు. బ్యాటర్​గా, సారథిగా ఎంతో సక్సెస్ చూశాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో హిట్​మ్యాన్ రివీల్ చేశాడు.

సాధారణ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి చేరాడు. బ్యాటర్​గా, సారథిగా ఎంతో సక్సెస్ చూశాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో హిట్​మ్యాన్ రివీల్ చేశాడు.

  • Published May 15, 2024 | 4:12 PMUpdated May 15, 2024 | 4:12 PM
Rohit Sharma: నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అదొక్కటే కారణం: రోహిత్ శర్మ

సాధారణ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. కెరీర్ ఆరంభంలోనే టీ20 కప్ వరల్డ్ కప్​ను ముద్దాడాడు. ఆ తర్వాత బ్యాటర్​, సారథిగా ఎంతో సక్సెస్ చూశాడు. కెప్టెన్​గా ఇప్పుడు టీమ్​ను సక్సెస్​ఫుల్​గా ముందుండి నడిపిస్తున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ తృటిలో మిస్సవడంతో నెక్స్ట్‌ జరగబోయే టీ20 కప్పునైనా భారత్​కు అందించాలని పట్టుదలతో ఉన్నాడు. దశాబ్దంన్నర కింద అనామకుడిగా కెరీర్​ను స్టార్ట్ చేసిన రోహిత్.. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదిగాడు. తన కెరీర్ మొదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిట్​మ్యాన్ అనేక విషయాలను పంచుకున్నాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి అదొక్కటే కారణమని అన్నాడు.

చిన్నప్పుడు తాను పడిన కష్టాలే తనను ఈ స్థాయికి చేర్చాయని రోహిత్ అన్నాడు. ఆ సమయంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు, ఎత్తుపల్లాల వల్ల రాటుదేలానని హిట్​మ్యాన్ చెప్పాడు. ‘ఓ మనిషిగా నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా గత జీవితమే. చిన్నతనంలో పడిన బాధలు, కష్టాలు, ఎత్తుపల్లాలు క్రికెట్​ను కొత్త కోణంలో చూసేందుకు నాకు ఉపయోగపడ్డాయి. అవి నన్ను డిఫరెంట్ పర్సన్​గా మార్చేశాయి. క్రికెట్ అంటే నాకు పిచ్చి ప్రేమ. అదే నా ప్యాషన్. ఈ 17 ఏళ్ల క్రికెట్ జర్నీ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంకొన్నేళ్లు ఇలాగే ఆడుతూ ప్రపంచ క్రికెట్​ మీద నా ముద్రను మరింత గొప్పగా వేయాలని భావిస్తున్నా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఏ క్రికెటర్​కైనా తన జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహించడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదన్నాడు రోహిత్. టీమిండియాకు సారథ్యం వహిస్తానని తానెప్పుడూ అనుకోలేదని.. ఆ దిశగా తాను ఆలోచించలేదన్నాడు. అయితే మంచి వ్యక్తులకు మంచే జరుగుతుందని అంటుంటారని, అందుకే తన విషయంలో అలా జరిగిందని హిట్​మ్యాన్ పేర్కొన్నాడు. భారత జట్టును కెప్టెన్​గా ముందుండి లీడ్ చేయడాన్ని మించిన సంతోషం ఇంకొకటి లేదన్నాడు. టీమ్​గా అందరం కలసికట్టుగా ఎలా ఆడాలి? ఎలా విజయాలు సాధించాలనే దాని మీదే తన ఫోకస్ ఉంటుందని, పర్సనల్ మైల్​స్టోన్స్​ను అస్సలు లెక్కచేయనని రోహిత్ స్పష్టం చేశాడు. జట్టులోని 11 మంది కలసి విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపాడు. మరి.. కెరీర్, లైఫ్​పై రోహిత్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.